బ్యాంకులో ఉద్యోగాలు, ఎల్లుండి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (IDBI SO Recruitment 2025 Notification PDF)

IDBI SO రిక్రూట్‌మెంట్ 2025 (IDBI SO  Recruitment 2025 Notification PDF) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు ఇక్కడ అందించడం జరిగింది. 

బ్యాంకులో ఉద్యోగాలు, ఎల్లుండి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (IDBI SO  Recruitment 2025 Notification PDF)

IDBI SO రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ (IDBI SO  Recruitment 2025 Notification PDF) : IDBI (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) బ్యాంకు నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా  119 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరడం జరిగింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ PDFని ఈరోజు అంటే  ఏప్రిల్ 04, 2025న తన అధికారిక వెబ్‌సైట్‌ www.idbibank.inలో విడుదల చేసింది. IDBI SO ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 7, 2025న ప్రారంభమవుతుంది.  IDBI Bank SO Notification 2025కి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందించాం. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు, ముఖ్యమైన తేదీలు కూడా ఇక్కడ తెలుసుకోండి.

IDBI SO 2025 నోటిఫికేషన్ PDF లింక్

IDBI SO 2025 నోటిఫికేషన్ PDF కోసం ఈ దిగువున ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేసి డౌన్‌లోడ్ చేసుకోండి.

IDBI SO 2025 ముఖ్యమైన తేదీలు (IDBI SO 2025 Important Dates)

IDBI SO రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF ద్వారా వెల్లడించింది. IDBI SO ఖాళీ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 7, 2025న ప్రారంభమవుతుంది. ఈ దిగువున ఇచ్చిన టేబుల్లో ముఖ్యమైన తేదీలను ఇక్కడ చూడొచ్చు.
IDBI SO ఈవెంట్స్ 2025 ముఖ్యమైన తేదీలు
IDBI SO నోటిఫికేషన్ విడుదల తేదీ 2025 4 ఏప్రిల్ 2025
IDBI SO ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 2025 7 ఏప్రిల్ 2025
దరఖాస్తు ఫార్మ్, ఫీజు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ 20 ఏప్రిల్ 2025
IDBI SO ఆన్‌లైన్ పరీక్ష తేదీ 2025 అప్‌డేట్ చేయబడుతుంది

IDBI SO రిక్రూట్‌మెంట్ 2025 దరఖాస్తు ఫీజు (IDBI SO Recruitment 2025 Application Fee)

IDBI SO పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ముందుగా దరఖాస్తు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  డెబిట్ కార్డులు (రూపే/ వీసా/ మాస్టర్ కార్డ్/ మాస్ట్రో), క్రెడిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డులు,  మొబైల్ వాలెట్లను ఉపయోగించి చెల్లించవచ్చు. ఒకసారి చేసిన దరఖాస్తును రద్దు చేసుకోవడం అవ్వదు. ఒక్కసారి చెల్లించిన ఫీజు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు.

కేటగిరి దరఖాస్తు ఫీజు (GSTతో సహా)
జనరల్/ OBC/ EWS రూ. 1050/-
SC/ST రూ. 250/-

Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.

Get Help From Our Expert Counsellors

ట్రెండింగ్ న్యూస్

తెలుసుకునే మొదటి వ్యక్తి మీరే అవ్వండి.

లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనుమతి పొందండి

మీరు ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మమ్మల్ని అడగండి.

  • 24-48 గంటల్లో మీకు రిప్లై ఇవ్వబడుతుంది.

  • వ్యక్తిగత రెస్పాన్స్ పొందండి

  • ఉచితంగా

  • కమ్యూనిటీ కు అనుమతి పొందండి

లేటెస్ట్ న్యూస్