JEE Mains Result 2024 Time Session 1: ఈరోజే జేఈఈ మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు విడుదల, చెక్ చేసుకునేందుకు అవసరమైన వివరాలు ఇక్కడ చూడండి
JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాలు (JEE Mains Result 2024 Time Session 1) ఫిబ్రవరి 12న విడుదల చేయబడుతుంది. అభ్యర్థులు ఫలితాన్ని యాక్సెస్ చేయడానికి అవసరమైన తప్పనిసరి వివరాల జాబితాను చెక్ చేయవచ్చు.
JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితం (JEE Mains Result 2024 Time Session 1) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ JEE మెయిన్ సెషన్ 1 ఫలితం 2024 ఈరోజు, ఫిబ్రవరి 12, 2024న విడుదల చేయనుంది. JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితాన్ని (JEE Mains Result 2024 Time Session 1) డౌన్‌లోడ్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా లాగిన్ ఆధారాలను అంటే అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేయాలి. పర్సంటైల్ స్కోర్‌ను యాక్సెస్ చేయడానికి అభ్యర్థులు తప్పనిసరిగా ఈ వివరాలను దగ్గర ఉంచుకోవాలి.
అభ్యర్థులు అప్లికేషన్ నెంబర్ వంటి వారి లాగిన్ వివరాలను మరిచిపోయినా ఫర్వాలేదు. వాటిని పొందడానికి వేరే మార్గం ఉంది. మరిచిపోయిన లాగిన్ వివరాలను తిరిగి పొందవచ్చు. జేఈఈ మెయిన్ పోర్టల్ jeemain.nta.ac.inలో అందుబాటులో ఉన్న 'సెషన్ 1 కోసం లాగిన్' ఆప్షన్‌పై క్లిక్ చేసి, 'అప్లికేషన్ నెంబర్‌ను మర్చిపోయాను' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయవచ్చు. అభ్యర్థులు అవసరమైన దశలను అనుసరించి, అప్లికేషన్ నెంబర్‌ను తిరిగి పొందవచ్చు. JEE మెయిన్ ఫలితం 2024ని చెక్ చేయవచ్చు.
JEE మెయిన్ 2024 సెషన్ 1 ఫలితం: టై-బ్రేకింగ్ పాలసీ (JEE Main 2024 Session 1 Result: Tie-breaking policy)
ఎక్కువ మంది విద్యార్థులకు JEE మెయిన్ సెషన్ 1 పరీక్షలో ఒకే విధమైన స్కోర్‌ను పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ఆ విద్యార్థుల ర్యాంకులు నిర్ణయించడం కష్టం. దీని కోసం అధికారులు టై-బ్రేకింగ్ విధానాన్ని అమలు చేస్తుంది. ఆ ట్రై బ్రేకింగ్ పాలసీ ఏ విధంగా ఉంటుందో దిగువున చూడండి. అభ్యర్థుల మధ్య టై కొనసాగితే కొన్ని సబ్జెక్టుల్లో వచ్చిన స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొనసాగితే వయస్సును కూడా పరిగణలోకి తీసుకుంటారు.
- మ్యాథ్స్‌లో NTA స్కోర్
- ఫిజిక్స్‌లో NTA స్కోర్
- కెమిస్ట్రీలో NTA స్కోర్
- ఇంకా టై కొనసాగితే అన్ని సబ్జెక్టులలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
- గణితంలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
- ఫిజిక్స్‌లో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
- కెమిస్ట్రీలో తక్కువ తప్పు సమాధానాలను గుర్తించిన అభ్యర్థులు
- వయసులో పెద్దవారు,
- ఇంకా టై అలా కొనసాగితే JEE మెయిన్ సెషన్ 1 ఆరోహణ సంఖ్యలో అప్లికేషన్ నెంబర్
ముఖ్యమైన లింకులు |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.