నేటితో JEE మెయిన్స్ 2025 ఆన్సర్ కీ అభ్యంతర విండో క్లోజ్ (JEE Mains 2025 Answer Key Objection Window)
JEE మెయిన్ 2025 సెషన్ 1 ఆన్సర్ కీ అభ్యంతరాల విండో (JEE Mains 2025 Answer Key Objection Window) ఈరోజు క్లోజ్ అవుతుంది. అభ్యంతరాలు తెలియజేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈరోజు రాత్రి 11:50 గంటలలోపు తప్పకుండా దరఖాస్తు చేసుకోవాలి.

జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీపై అబ్జెక్షన్స్ విండో (JEE Mains 2025 Answer Key Objection Window) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, NTA, జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, JEE మెయిన్స్ 2025 అభ్యంతరాల విండోను (JEE Mains 2025 Answer Key Objection Window) ఈరోజుతో క్లోజ్ అవ్వనుంది. సెషన్ 1 ఆన్సర్ కీ ఫిబ్రవరి 4న విడుదలైంది. అభ్యంతరాల విండో ఈరోజు ఫిబ్రవరి 6న (రాత్రి 11:50 గంటలకు) మూసివేయబడుతుంది. గడువు తేదీ తర్వాత సమర్పించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబడవు. అభ్యర్థి లేవనెత్తిన అభ్యంతరాలలో ఏదైనా సరైనదని తేలితే, పరీక్షా సంస్థ ఆన్సర్ కీని రివైజ్ చేయాల్సి ఉంటుంది. నమూనాను అనుసరించి, ప్రొవిజనల్ కీ ఆధారంగా ఫైనల్ ఆన్సర్ కీని తయారు చేస్తారు. ఫైనల్ కీ ఆధారంగా ఫలితం తయారు చేయబడుతుంది. ఆన్సర్ కీని చెక్ చేయడానికి, అభ్యంతరాలను లేవనెత్తడానికి దశలను ఇక్కడ చెక్ చేయండి.
జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీని ఎలా చెక్ చేయాలి? (JEE Mains 2025: How to Check Answer Key)
JEE Main 2025 ఆన్సర్ కీని చెక్ చేయడానికి పైన పేర్కొన్న దశలను ఫాలో అవ్వాలి.- JEE మెయిన్స్ 2025 ఆన్సర్ కీని ఎలా చెక్ చేసుకోవాలి.
- అధికారిక వెబ్‌సైట్‌కి jeemain.nta.ac.in వెళ్లాలి.
- హోంపేజీలో'ఆన్సర్ కీ ఛాలెంజ్' పై క్లిక్ చేయాలి.
- తదుపరి దశలో, అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
- “వీక్షణ/సవాలు ఆన్సర్ కీ ” పై క్లిక్ చేసి ప్రశ్నపత్రాన్ని వీక్షించండి.
జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీ అభ్యంతరాలు ఎలా తెలియజేయాలి? (JEE Main 2025 - How to Raise objections?)
జేఈఈ మెయిన్ 2025 ఆన్సర్ కీపై ఈ దిగువున తెలిపిన విధంగా అభ్యంతరాలను తెలియజేయాలి.- NTA ఆప్షన్‌ను సవాలు చేయడానికి తదుపరి నాలుగు నిలువు వరుసలలో ఇవ్వబడిన ఎంపిక IDలపై క్లిక్ చేయాలి.
- 'మీ క్లెయిమ్‌లను సేవ్ చేయి' అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, సహాయక డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
- 'మీ క్లెయిమ్‌ను సేవ్ చేసి, చివరకు ఫీజు చెల్లించండి' అనే ఆప్షన్‌పై పై క్లిక్ చేయాలి.
- చెల్లింపు విధానాన్ని ఎంచుకుని, రూ. 200 ఫీజుచెల్లించాలి.
- భవిష్యత్ సూచనల కోసం నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.