JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023( JEE Main Admit Card 2023): విడుదల తేదీ తెలుసుకోండి
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 (JEE Main Admit Card 2023) జనవరి మూడవ వారంలో అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా NTA అధికారులు విడుదల చేస్తారు. జేఈఈ మెయిన్ పరీక్షల తేదీల సమాచారం కూడా విద్యార్థులు ఈ ఆర్టికల్ లో పొందవచ్చు.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 ( JEE Main Admit Card 2023) : భారతదేశంలో జేఈఈ మెయిన్స్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షను జనవరి 24వ తేదీ నుండి జనవరి 31 వ తేదీ వరకూ నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షకు అప్లై చేసుకున్న విద్యార్థులు jeemain.nic.in వెబ్సైట్ ద్వారా వారి అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు(JEE Main Admit Card 2023) జనవరి నెల మూడవ వారంలో అధికారికంగా విడుదల చేస్తారు . విద్యార్థులు అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత ఎగ్జామ్ సెంటర్ లో పరీక్ష వ్రాయాల్సి ఉంటుంది.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 ముఖ్యమైన తేదీలు ( JEE Main Admit Card 2023 Important Dates)
జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింది ఉన్న పట్టికలో వివరించబడ్డాయి.
కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ( How to Download JEE Main Admit Card 2023?)
విద్యార్థులు ఈ క్రింద వివరించిన స్టెప్స్ అనుసరించి వారి జేఈఈ మెయిన్ సెషన్ 1 అడ్మిట్(JEE Main Admit Card 2023) కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ " jeemain.nta.nic.in" ఓపెన్ చేయండి.
- ఇక్కడ " JEE Main Admit Card 2023 " మీద క్లిక్ చేయండి.
- ఇప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు మీ అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి.
- మీ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత " Submit" పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీ జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 స్క్రీన్ మీద కనిపిస్తుంది. హాల్ టికెట్ ను సేవ్ చేసి, ప్రింట్ అవుట్ తీసుకోండి.
జేఈఈ మెయిన్ 2023 ముఖ్యమైన సూచనలు ( Important Instructions for JEE Main 2023)
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్ష కు హాజరు అవుతున్న విద్యార్థులు వారి అడ్మిట్ కార్డ్(JEE Main Admit Card 2023) తో పాటు తప్పని సరిగా వారి ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ను తీసుకుని వెళ్ళాలి. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలను కూడా విద్యార్థులు తీసుకుని వెళ్ళాలి.
JEE Main 2023 గురించిన మరింత ముఖ్యమైన సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.