అతి త్వరలో JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023(JEE Main Admit Card 2023) డౌన్‌లోడ్ jeemain.nta.nic.inలో ప్రారంభమవుతుంది.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు 2023 (JEE Main Admit Card 2023) అతి త్వరలో అఫీషియల్ వెబ్సైట్ jeemain.nta.nic.in లో విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఎంట్రన్స్ పరీక్షలు 24 జనవరి 2023 తేదీ నుండి ప్రారంభం అవుతున్నాయి.
జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డ్ 2023 (JEE Main Admit Card 2023) : నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ లను అతి త్వరలో విడుదల చేయనున్నారు. మరో రెండు రోజుల్లో అడ్మిట్ కార్డులు విడుదల అయ్యే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ పరీక్షకు అప్లై చేసుకున్న విద్యార్థులు jeemain.nta.nic.in వెబ్సైట్ నుండి వారి అడ్మిట్ కార్డ్ లను(JEE Main Admit Card 2023) డౌన్లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ 2023 సెషన్ -1 పరీక్షలు జనవరి 24వ తేదీ నుండి జనవరి 31 వ తేదీ వరకూ జరగనున్నాయి. అయితే జనవరి 27వ తేదీ జరిగే పరీక్ష మాత్రం ఫిబ్రవరి 1, 2023 తేదీ కు మార్చబడింది అని విద్యార్థులు గమనించాలి. జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రెండు సెషన్స్ లో జరుగుతుంది. విద్యార్థులు ఈ రెండు సెషన్స్ లో కూడా పరీక్ష రాసే అవకాశం ఉంది. విద్యార్థులు సెషన్ 1 పరీక్ష రాయలేక పోయినా లేదా తక్కువ మార్కులు వచ్చినా సెషన్ 2 లో మళ్ళీ పరీక్షకు హాజరు అవ్వవచ్చు. ఈ రెండు సెషన్స్ లో ఏ పరీక్షలో అయితే విద్యార్థి ఎక్కువ స్కోరు సాధిస్తారో ఆ స్కోరునే జేఈఈ మెయిన్ స్కోరు గా పరిగణిస్తారు.
Check Also: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు 2023 రిలీజ్ డేట్ (JEE Main Admit Card 2023 Release Date)
జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ( How to Download JEE Main 2023 Admit Card?)
విద్యార్థులు ఈ క్రింద వివరించిన స్టెప్స్ ద్వారా జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ "jeemain.nta.nic.in" ఓపెన్ చేయండి.
- ' JEE Main 2023 Session 1 Admit Card ' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి.
- అప్లికేషన్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ' Submit ' పై క్లిక్ చేయండి.
- మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్ మీద కనిపిస్తుంది.
- జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డ్ ను సేవ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.
విద్యార్థులు వారికి కేటాయించిన తేదీలో సంబంధిత పరీక్ష కేంద్రంలో హాజరు అవ్వాలి. విద్యార్థులు తప్పకుండా వారి అడ్మిట్ కార్డులను మరియు ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ను కూడా పరీక్షా కేంద్రానికి తీసుకుని వెళ్ళాలి. జేఈఈ మెయిన్ 2023 పరీక్ష ఆఫ్లైన్ విధానంలోనే జరుగుతుంది. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష హాల్ లోకి అనుమతించరు అని విద్యార్థులు గమనించాలి.
జేఈఈ మెయిన్ 2023 గురించిన సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.