JEE మెయిన్ 2023 పరీక్ష రోజున ( Documents Required on JEE MAIN 2023 Exam Day) అవసరమైన ముఖ్యమైన పత్రాల జాబితాను ఇక్కడ తెలుసుకోండి
జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు జనవరి 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజు అవసరమైన పత్రాల జాబితా ( Documents Required on JEE MAIN 2023 Exam Day) విద్యార్థులు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజు అవసరమైన పత్రాలు ( Documents Required on JEE MAIN 2023 Exam Day) : జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలు జనవరి 24, 2023 తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ పరీక్షలు NTA షెడ్యూల్ ప్రకారం జనవరి 24, 25, 28, 29, 30, 31 తేదీల్లో జేఈఈ మెయిన్ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ మెయిన్ 2023 పరీక్షలు ఆన్‌లైన్ మోడ్‌లో నిర్వహించడం జరుగుతుంది. అభ్యర్థుల జేఈఈ మెయిన్ ఎగ్జామ్ అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు (JEE Main 2023 Advance City Intimation Slip) ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్ 2023 అడ్మిట్ కార్డులు కూడా అతి త్వరలో విడుదల చేయనున్నారు. జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) పరీక్షలకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌లు www.nta.ac.in, jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 పరీక్షలలో జనవరి 27వ తేదీన జరగాల్సిన పరీక్ష ఫిబ్రవరి 1, 2023 తేదీకి మార్చబడింది అని విద్యార్థులు గమనించాలి. ఈ పరీక్షలకు హాజరు అవుతున్న విద్యార్థులు తప్పనిసరిగా కొన్ని పత్రాలను (JEE Main Advance Intimation Slip) తీసుకుని వెళ్లాలి వాటిని తీసుకుని వెళ్లకపోతే విద్యార్థులను పరీక్ష హాలులోకి అనుమతించరు. జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజున విద్యార్థులు ఏ డాక్యుమెంట్లు తీసుకుని వెళ్లాలో (Documents Required on JEE MAIN 2023 Exam Day) ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
జేఈఈ మెయిన్ 2023 పరీక్ష రోజు అవసరమైన పత్రాలు ( Documents Required on JEE MAIN 2023 Exam Day)
జేఈఈ మెయిన్ 2023 పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులు ఈ క్రింద వివరించిన డాక్యుమెంట్లను తప్పని సరిగా పరీక్ష కేంద్రానికి తీసుకుని వెళ్లాలి.- అఫిషియల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న జేఈఈ అడ్మిట్ కార్డు (JEE Main 2023 Admit card ) (అడ్మిట్ కార్డు మీద విద్యార్థి సంతకం ఉండాలి)
- విద్యార్థి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ( అప్లికేషన్ ఫారం లో ఇచ్చిన ఫోటో నే ఇక్కడ కూడా ఇవ్వాలి)
- ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ( ఆధార్ కార్డు, ఓటర్ కార్డ్ , డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లేదా కాలేజీ సర్టిఫై చేసిన ఐడీ కార్డ్)
- PwD సర్టిఫికెట్ ( PwD కేటగిరీ విద్యార్థులు , డాక్టర్ చేత ధ్రువీకరించబడిన PwD సర్టిఫికెట్ ఒరిజినల్ కాపీ ను తీసుకుని వెళ్లాలి)