నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించే జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26కి దరఖాస్తు ప్రక్రియ (JNVST Class 6 Admission Form 2024) ప్రారంభమైంది.
జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26కి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం (JNVST Class 6 Admission Form 2024): నవోదయ విద్యాసంస్థల్లో 6వ తరగతి ప్రవేశాలకు జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆరో తరగతిలో చేరేందుకు అర్హులవుతారు. ఈ టెస్ట్‌కు సంబంధించిన అప్లికేషన్ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. JNV అడ్మిషన్ 2025-26 దరఖాస్తు ఫార్మ్ 16 జూలై నుంచి 16 సెప్టెంబర్ 2024 వరకు ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. సెషన్ 2025-26 కోసం NVS అడ్మిషన్ ఫార్మ్‌ను navodaya.gov.inలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: 8000 వేలకుపైగా బ్యాంకు ఉద్యోగాలు, 3 నెలల్లో నోటిఫికేషన్
జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్
జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్‌కు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్‌లను ఈ దిగువున అందించాం. వాటిపై క్లిక్ చేసి వివరాలు చూడొచ్చు.జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్ PDF - ఇక్కడ క్లిక్ చేయండి |
జవహార్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ 2025-26 అప్లికేషన్ లింక్ - ఇక్కడ క్లిక్ చేయండి |
జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26 ముఖ్యమైన తేదీలు (JNVST 2025 Important Dates)
జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26కి సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం. నవోదయ విద్యాలయ సమితి (NVS) JNVST 2025 (NVS క్లాస్-6 అడ్మిషన్) నోటిఫికేషన్‌ను 16 జూలై 2024న విడుదల చేసింది. విద్యార్థులు పరిశీలించవచ్చు.ఎగ్జామ్ అథారిటీ | నవోదయ విద్యాలయ సమితీ |
పరీక్ష పేరు | జవర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26 |
కేటగిరి | NVS అడ్మిషన్ అప్లికేషన్ ఫార్మ్ 2024 |
JNVST అప్లికేషన్ ఫార్మ్ మొదలైన తేదీ | జూలై 16, 2024 |
JNVST దరఖాస్తుకు చివరి తేదీ | సెప్టెంబర్ 16, 2024 |
JNVST 2025 పరీక్ష తేదీ | ఏప్రిల్ 12, 2025 |
జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26 వయస్సు పరిమితి (JNV Admission 2024 Age Limit)
జవహర్ నవోదయ విద్యాలయ టెస్ట్ 2025-26కి హాజరవ్వాలనుకునే విద్యార్థులు కచ్చితంగా 01-05-2013కి ముందు 31-07-2015 తర్వాత జన్మించి ఉండకూడదు. తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థి అడ్మిషన్ సమయంలో సంబంధిత ప్రభుత్వ అధికారి జారీ చేసిన జనన ధ్రువీకరణ పత్రం కాపీని సమర్పించాలి. ఇది షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతి (OBC)కి చెందిన వారితో సహా అన్ని కేటగిరీల అభ్యర్థులకు వర్తిస్తుంది.నవోదయ విద్యాలయ అడ్మిషన్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to apply for Navodaya Vidyalaya Admission 2024)
JNVST-2025 (JNV అడ్మిషన్ క్లాస్-6) కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి.- ముందుగా అభ్యర్థులు navodaya.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- తర్వాత మెనూ బార్‌లోని అడ్మిషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత సబ్ మెనూలోని అడ్మిషన్ నోటిఫికేషన్‌లపై క్లిక్ చేయాలి.
- అప్పుడు JNV అడ్మిషన్ నోటిఫికేషన్, దరఖాస్తు ఆన్‌లైన్ లింక్ ఇవ్వబడిన చోట కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఈ URLతో కొత్త వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
- NVS అడ్మిషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్ PDF, రిజిస్ట్రేషన్ లింక్, మునుపటి సంవత్సరం పేపర్‌లు, విభిన్న ఫార్మాట్‌లు మొదలైన అన్ని వివరాలు.
- NVS అడ్మిషన్ 2024 నమోదు ప్రక్రియను పూర్తి చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్2ను పూరించాలి.
- అప్లికేషన్ పూరించి, అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసి దాని ప్రింట్ అవుట్‌లను తీసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.