NEET UG 2023 City Intimation Slip: NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ని ఈ డైరక్ట్ లింక్‌తో డౌన్‌లోడ్ చేసుకోండి
NEET 2023 అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఏప్రిల్ 30, 2023న విడుదల చేయడం జరిగింది. ఇతర ముఖ్యమైన సూచనలతో పాటు ఇంటిమేషన్ స్లిప్లను (NEET UG 2023 City Intimation Slip) డౌన్‌లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువన పొందండి.
NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ (NEET UG 2023 City Intimation Slip): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) NEET UG 2023 పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను ఏప్రిల్ 30, 2023న neet.nta.nic.inలో విడుదల చేసింది. ఇంటిమేషన్ స్లిప్లను (NEET UG 2023 City Intimation Slip) డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ లింక్ ఇప్పుడు యాక్టివేట్ అయింది. విద్యార్థులు అప్లికేషన్ ID, పుట్టిన తేదీని ఉపయోగించి వారి అకౌంట్లకు లాగిన్ అయి, నీట్ సిటీ ఇంటిమేషన్ స్లిప్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ దిగువున ఇచ్చిన డైరక్ట్ లింక్‌తో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డ్‌లు కాదని విద్యార్థులు గమనించాలి.ఇంటిమేషన్ స్లిప్ (NEET UG 2023 City Intimation Slip) ద్వారా విద్యార్థి తమకు కేటాయించబడిన పరీక్షా కేంద్ర నగరం మాత్రమే తెలియజేయబడుతుంది. తద్వారా వారి ప్రయాణానికి ముందుగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. NTA అడ్మిట్ కార్డ్‌లను మే 2023 మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. నీట్ UG మే 7, 2023న జరగనుంది.
NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్ లింక్ (NEET 2023 City Intimation Slip Link)
NEET 2023 అడ్వాన్స్ సిటీ స్లిప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అధికారిక లింక్‌కి మళ్లించడానికి దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయండి.NEET 2023 సిటీ ఇంటిమేషన్ స్లిప్: ముఖ్యమైన సూచనలు (NEET 2023 City Intimation Slip: Important instructions)
NEET సిటీ ఇంటిమేషన్ స్లిప్ 2023కి సంబంధించి కింది ముఖ్యమైన సూచనలు ఉన్నాయి:- అడ్వాన్స్ ఎగ్జామ్ సిటీ అలాట్‌మెంట్ స్లిప్ ఆన్‌లైన్‌లో neet.nta.nic.in, examservices.nic.inలో మాత్రమే పబ్లిష్ చేయబడుతుంది.
- మీ రిజిస్టర్డ్ అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, క్యాప్చా కోడ్‌ని ఎంటర్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- సిటీ ఇన్టిమేషన్ స్లిప్‌లో మీ వ్యక్తిగత వివరాలు, పేరు, కేటగిరి, DOB, ప్రశ్నాపత్రం యొక్క మాధ్యమం, పరీక్ష తేదీ, సమయం, దాని ప్రాథమిక సమాచారంతో పాటు: కేటాయించిన పరీక్షా నగరం వంటి వివరాలు ఉంటాయి.
- మీరు మీ అప్లికేషన్ ఫార్మ్‌కి సంబంధించి ఈ వివరాల్లో ఏదైనా వ్యత్యాసాన్ని గుర్తిస్తే మీరు వెంటనే NTAకి నివేదించాలి. తద్వారా అడ్మిట్ కార్డ్‌ల విడుదలకు ముందే సరిదిద్దుకోవచ్చు.
- పరీక్షా కేంద్రానికి సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.అయితే, హాల్ టికెట్‌లో మీకు కేటాయించిన పరీక్షా నగరం సిటీ స్లిప్‌తో సమానంగా లేకపోతే దానిని సేవ్ చేసుకోవాలి.
- పరీక్ష కేంద్రం పేరు సిటీ ఇంటిమేషన్ స్లిప్ ద్వారా తెలియజేయబడదు. అది మీ హాల్ టికెట్‌లో మాత్రమే పేర్కొనబడుతుంది.
ఎంట్రన్స్ పరీక్షలు, బోర్డులు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా కూడా మమ్మల్ని సంప్రదింవచ్చు.