NEET Answer Key 2023 Released: NEET ఆన్సర్ కీ 2023ని విడుదల, అభ్యంతరాలు తెలియజేయడానికి జూన్ 6 లాస్ట్ డేట్
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక NEET ఆన్సర్ కీ 2023ని తమ వెబ్‌సైట్ neet.nta.nic.inలో జూన్ 4న విడుదల (NEET Answer Key 2023 Released) చేసింది. దరఖాస్తుదారులు ఆన్సర్ కీకి డైరెక్ట్ లింక్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఆన్సర్ కీపై అభ్యర్థులు జూన్ 06వ తేదీలోపు అభ్యంతరాలు తెలియజేయాలి.
నీట్ ఆన్సర్ కీ 2023 విడుదల (NEET Answer Key 2023 Released): అధికారిక NEET ఆన్సర్ కీ 2023 విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్‌సైట్ neet.nta.nic.inలో జూన్ 4న ఆన్సర్ కీని (NEET Answer Key 2023 Released)విడుదల చేయడం జరిగింది. NEET 2023 పరీక్ష మే 7న జరిగింది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లి, పరీక్షలో తమ సరైన స్కోర్‌లను మూల్యాంకనం చేయడానికి అధికారిక NEET ఆన్సర్ కీ 2023ని చెక్ చేయవచ్చు.
ప్రస్తుతం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసిన NEET ఆన్సర్ కీ 2023 ప్రొవిజనల్‌గా అభ్యర్థులు గుర్తించాలి. దీనిపై అభ్యర్థులు అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రామాణికమైన పత్రాలతో ఆన్సర్ కీలో సమాధానాన్ని సవాలు చేయవచ్చు. అభ్యంతరాలు తెలియజేయడానికి విండో రెండు, మూడు రోజుల్లో యాక్టివేట్ అవుతుంది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలియజేయడానికి ఫీజు చెల్లించాలి. ప్రతి అభ్యంతరానికి రూ. 200లు చెల్లించాలి. ఆ తర్వాత అధికారులు అభ్యర్థులు తెలియజేసిన అభ్యంతరాలని విశ్లేషించి, రివైజ్డ్ అధికారిక NEET ఆన్సర్ కీ 2023ని రూపొందిస్తారు.
అధికారిక NEET ఆన్సర్ కీ 2023కి వ్యతిరేకంగా అభ్యంతరాలను ఎలా తెలిజేయాలి? (How to Raise Objections against the Official NEET Answer Key 2023?)
మొత్తం నాలుగు ప్రశ్నాపత్రాల సెట్‌ల కోసం (E, F, G, H) NEET ఆన్సర్ కీ 2023 విడుదల చేయబడింది. దరఖాస్తుదారులు అధికారిక NEET ఆన్సర్ కీ 2023కి వ్యతిరేకంగా అభ్యంతరాలను తెలియజేయడానికి ఈ దిగువున పేర్కొన్న విధానాన్ని ఫాలో అవ్వాలి.
- స్టెప్ 1: NTA అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inకి వెళ్లండి.
స్టెప్ 2: హోంపేజీలో NEET లాగిన్ ఆప్షన్ కోసం శోధించండి. దానిపై క్లిక్ చేయండి.
స్టెప్ 3: రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వంటి మీ లాగిన్ వివరాలను టైప్ చేయండి.
స్టెప్ 4: 'Enter' నొక్కండి.
స్టెప్ 5: ఇప్పుడు 'ఆన్సర్ కీ ఛాలెంజ్' ట్యాబ్‌కు వెళ్లి, 'టెస్ట్ బుక్‌లెట్ కోడ్' ఎంపికను ఎంచుకోండి
స్టెప్ 6: డ్రాప్-డౌన్ నుంచి మీరు సవాల్ చేయాలనుకుంటున్న ప్రశ్నను, దానికి సరైన ప్రతిస్పందనను ఎంచుకోండి.
స్టెప్ 7: తర్వాత మీ ఆప్షన్‌ను సమర్థించే పత్రాన్ని అప్‌లోడ్ చేయండి.
స్టెప్ 8: 'నా క్లెయిమ్‌ను సేవ్ చేయి'పై నొక్కండి.
స్టెప్ 9: తదుపరి ట్యాప్‌లో, 'నా క్లెయిమ్‌ను సేవ్ చేసి చివరకు ఫీజు చెల్లించండి'పై నొక్కండి.
స్టెప్ 10: తదుపరి పేజీలో అభ్యంతరం కోసం ఫీజు చెల్లించి, ప్రక్రియను పూర్తి చేయడానికి 'Enter' నొక్కండి.
ఇది కూడా చదవండి |
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.