నీట్ పీజీ 2023 (NEET PG 2023 internship Date) ఇంటర్న్‌షిప్ తేదీ పొడిగింపు : ఆరోగ్య మంత్రిత్వ శాఖ
ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 13,000 మంది MBBS విద్యార్థులు పరీక్షకు హాజరయ్యేందుకు అర్హులు కానందున NEET PG 2023 కోసం ఇంటర్న్‌షిప్ గడువును (NEET PG 2023 internship Date) పొడిగించాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.
NEET PG 2023 ఇంటర్న్‌షిప్ తేదీ (NEET PG 2023 Internship Date): ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి NEET PG 2023 ఇంటర్న్‌షిప్ గడువును ఆగస్టు 11, 2023 వరకు (NEET PG 2023 Internship Date) పొడిగించారు. ఔత్సాహికుల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నట్లు మంత్రి ధ్రువీకరించారు. ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి దాదాపు 13,000 MBBS విద్యార్థులు అర్హులు కాదని తెలిసింది. దాంతో NEET PG 2023 కోసం ఇంటర్న్‌షిప్ గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
నీట్ పీజీ 2023 ఇంటర్న్‌షిప్ గడువు (NEET PG 2023 Internship Date) ఆగస్టు వరకు పొడిగించబడినప్పటికీ మార్చి 5న నిర్వహించాల్సిన ఎంట్రన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు మంత్రిని అభ్యర్థిస్తున్నారు. పొడిగించిన ఇంటర్న్‌షిప్ గడువు కారణంగా NEET PG 2023 కౌన్సెలింగ్ ఆగస్టులో ప్రారంభమవుతుంది. పరీక్ష తేదీ, ఇంటర్న్‌షిప్ తేదీ మధ్య చాలా గ్యాప్ ఉంది. కాబట్టీ పరీక్ష తేదీని కనీసం 6 నుంచి 8 వారాల పాటు వాయిదా వేయాలని అభ్యర్థులు మంత్రిని కోరుతున్నారు.
NEET PG ఆశావహులు ఇంటర్న్‌షిప్ గడువును పొడిగించాలని, పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఫిబ్రవరి 7, 2023న నిరసన తెలిపారు. మొదటి డిమాండ్ నెరవేరినప్పటికీ పరీక్ష వాయిదాపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
NEET PG 2023కు ఇంటర్న్‌షిప్ గడువు పొడిగించబడినందున నీట్ 2023 ప్రవేశ పరీక్షను మరో తేదీకి వాయిదా వేసే అవకాశం ఉంది. అభ్యర్థులు దీనిపై అధికారిక ప్రకటన వెలువడానికి మరికొన్ని రోజులు టైం పట్టే అవకాశం ఉంది. అయితే NEET PG 2023 కోసం అభ్యర్థులు మాత్రం ప్రిపరేషన్‌ను కొనసాగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
NBE NEET PG 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్‌ని తిరిగి ఓపెన్ చేయాలని భావిస్తోంది. ఇంటర్న్ షిప్ డేట్స్ పొడిగించిన ప్రకారం మరికొంతమంది విద్యార్థుల నుంచి రిజిస్ట్రేషన్‌లే ఆమోదించవచ్చు.దీనిపై అధికారిక నిర్ధారణ త్వరలో వచ్చే ఛాన్స్ ఉంది.
మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం College Dekhoని ఫాలో అవ్వండి.