NEET Results Released Date 2023: NEET ఫలితాలు విడుదల, ఒక క్లిక్‌తో ఇక్కడ చెక్ చేసుకోండి
NEET ఫలితాలు 2023 (NEET Results Released Date 2023) ఈరోజు విడుదలయ్యాయి. NTA NEET 2023 పరీక్షను మే 07వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షకు 21 లక్షల మంది అభ్యర్థులు రాశారు. NTA ఈరోజు ఫలితాలను రిలీజ్ చేసింది.
నీట్ ఫలితాలు విడుదల తేదీ (NEET Results Released Date 2023): నీట్ ఫలితాలు 2023 (NEET Results Released Date 2023) విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం (జూన్ 13, 2023న) 12 గంటలకు ఫలితాలను అధికారులు రిలీజ్ చేశారు. NTA NEET 2023 పరీక్షను మే 07వ తేదీన నిర్వహించింది. ఈ పరీక్షకు 21 లక్షల మంది అభ్యర్థులు రాశారు. ఇప్పటికే ఆన్సర్ కీ కూడా రిలీజ్ అయింది. లక్షలాది మంది అభ్యర్థులు NEET 2023 ఫలితాల కోసం ఎదురుచూశారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లో లాగిన్ అయి అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీలను నమోదు చేసి చెక్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 పరీక్షా కేంద్రాల్లో 2,087,449 మంది అభ్యర్థులు భారీగా పాల్గొన్నారు. నీట్ ఫలితాలు 2023 కౌన్సెలింగ్ తేదీలను కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. జూలై నెలలో కౌన్సెలింగ్ ప్రక్రియ ఉండే ఛాన్స్ ఉంది.
NEET UG ఫలితాలు 2023 డైరెక్ట్ డౌన్‌లోడ్ లింక్ (NEET UG Result 2023 Direct Download Link)
NEET ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారిక వెబ్‌సైట్ https://neet.nta.nic.in/లో అందుబాటులో ఉంటుంది. NEET 2023 ఫలితాన్ని సులభంగా యాక్సెస్ చేయడానికి, చెక్ చేడానికి మేము ఇక్కడ అప్‌డేట్ చేయబడిన డైరెక్ట్ లింక్‌ను అందజేశాం. NEET 2023 పరీక్షలో హాజరైన విద్యార్థులు అందించిన లింక్‌ను చూసి వారి NTA NEET 2023 ఫలితాలను వీక్షించడానికి వారి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి. NEET ఫలితం 2023ని చెక్ చేయడానికి కొన్ని లింక్‌లు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- neet.nta.nic.in.
- ntaresults.nic.in.
- nta.ac.in
NEET UG 2023 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే? (How to Check NEET UG 2023 Results)
నీట్ యూజీ 2023 ఫలితాలను ఈ దిగువున తెలిపిన పద్ధతిలో చెక్ చేసుకోవాలి.
- NEET అధికారిక సైట్ neet.nta.nic.in సందర్శించండి.
- హోంపేజీలో అందుబాటులో ఉన్న NTA NEET UG ఫలితం 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
- లాగిన్ వివరాలను నమోదు చేసి SUBMITపై క్లిక్ చేయండి.
- మీ ఫలితం స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- ఫలితాన్ని చెక్ చేసి పేజీని డౌన్‌లోడ్ చేయండి.
- భవిష్యత్తు అవసరం కోసం అదే హార్డ్ కాపీని దగ్గర ఉంచుకోవాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తలు, ఎడ్యుకేషన్ ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.