NEET UG 2023 దరఖాస్తు ఫారం విడుదల తేదీ ( NEET UG 2023 Registration Dates) : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ 2023 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ని ప్రకటించనుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (NEET UG 2023)ని NTA మే నెలలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 2023 నుండి విద్యార్థులు అధికారిక వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
NEET UG 2023 : నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 ( NEET UG 2023) త్వరలో నోటిఫికేషన్ మరియు దరఖాస్తు ఫారంను విడుదల చేయనుంది, విద్యార్థులు ఫిబ్రవరి 2023 నుండి NEET UG కు రిజిస్టర్ చేసుకోవచ్చు. భారతదేశంలోని MBBS సీట్లను భర్తీ చేయడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ( NTA) నీట్ పరీక్షను నిర్వహిస్తుంది. విద్యార్థులు neet.nta.nic.in వెబ్సైట్ ద్వారా రిజిష్టర్ చేసుకోవచ్చు. NEET UG ఎంట్రన్స్ పరీక్ష మే 2023 లో జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష మొత్తం 13 భాషలలో నిర్వహిస్తారు, విద్యార్థులు రిజిష్టర్ చేసుకునే సమయంలో వారికి కావాల్సిన భాష ను ఎంచుకోవచ్చు. ప్రతీ సంవత్సరం 8 లక్షలకు పైగా విద్యార్థులు నీట్ పరీక్ష కు హాజరు అవుతున్నారు.
NEET UG 2023 రిజిష్టర్ చేసుకునే విధానం, అవసరమైన డాక్యుమెంట్లు , ముఖ్యమైన తేదీల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.
NEET UG 2023 ముఖ్యమైన తేదీలు ( NEET UG 2023 Important Dates)
NEET UG 2023 కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరించబడ్డాయి, ఈ తేదీలు అంచనా అని విద్యార్థులు గమనించాలి.
కార్యక్రమం | తేదీ (అంచనా) |
జనవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
ఫిబ్రవరి 2023 | |
మార్చి 2023 | |
మే 2023 | |
జూన్ 2023 |
NEET UG 2023 కు ఎలా రిజిష్టర్ చేసుకోవాలి? ( How to Apply for NEET UG 2023)
విద్యార్థులు ఈ క్రింద ఇచ్చిన స్టెప్స్ ను అనుసరించి NEET UG 2023 కు రిజిష్టర్ చేసుకోవచ్చు.
- అధికారిక వెబ్సైట్ neet.nta.nic.in ఓపెన్ చేయండి.
- ' Register For NEET UG 2023' అనే లింక్ మీద క్లిక్ చేయండి.
- ఓపెన్ ఆయిన దరఖాస్తు ఫారం లో మీ వివరాలు పూర్తి చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి " Submit" మీద క్లిక్ చేయండి.
- అప్లికేషన్ ఫారం ను, ఫీజు రిసిప్ట్ ను సేవ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి.
NEET UG 2023 కు అవసరమైన డాక్యుమెంట్లు ( Documents Required to Apply NEET UG 2023)
NEET UG 2023 రిజిస్ట్రేషన్ కు క్రింద వివరించిన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి
- ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో
- 10వ తరగతి మార్క్స్ మెమో
- విద్యార్థి సంతకం.
- పాస్పోర్ట్ సైజ్ మరియు పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో లు
- ఐడీ ప్రూఫ్ ( ఆధార్ కార్డు, పాస్పోర్ట్ ఓటర్ ఐడి మొదలైనవి)
- కుల ధ్రువీకరణ పత్రం
- సిటిజెన్ షిప్ సర్టిఫికెట్
- PwD సర్టిఫికెట్
- ఎడమ చేతి బొటన వేలి ముద్ర
NEET UG 2023 గురించిన మరింత సమాచారం కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.