Navodaya Vidyalaya Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, 7,500కుపైగా ఉద్యోగాలు, పూర్తి వివరాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి
నవోదయ విద్యాలయ సమితి (Navodaya Vidyalaya Recruitment 2023) నుంచి 7500 ఖాళీలకుపైగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పీజీటీ, టీజీటీ, స్టాఫ్ నర్స్, కేటగిరి సూపర్వైజర్, వంటి పోస్టులున్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో అందజేశాం.
నవోదయ విద్యాలయ రిక్రూట్మెంట్ 2023 (Navodaya Vidyalaya Recruitment 2023): నవోదయ విద్యాలయ సమితి నుంచి రిక్రూట్మెంట్ (Navodaya Vidyalaya Recruitment 2023) నోటిఫికేషన్ విడుదలైంది. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (PGT), మెస్ హెల్పర్ పోస్టులకు దరఖాస్తులు కోరడం జరిగింది. నోటిఫికేషన్ ప్రకారం 7500 కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు అర్హతా ప్రమాణాలు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నవోదయ స్కూల్ సమితి రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు (Navodaya School Samithi Recrutiment Vacancy Details)
నవోదయ స్కూల్ సమితి రిక్రూట్మెంట్ ఖాళీల వివరాల గురించి ఈ దిగువున అందించడం జరిగింది.పోస్టు పేరు | ఖాళీల వివరాలు |
పీజీటీ (కంప్యూటర్ సైన్స్) | 306 |
పీజీటీ (మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్) | 46 పోస్టులు |
టీజీటీ (కంప్యూటర్ సైన్స్) | 649 |
టీజీటీ (ఆర్ట్) | 649 |
టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) | 1244 పోస్టులు |
టీజీటీ మ్యూజిక్ | 649 |
స్టాఫ్ నర్స్ | 649 |
కేటగిరి సూపర్ వైజర్ | 637 |
ఆఫీస్ సూపరింటెండెంట్ | 598 |
ఎలక్ట్రిషియన్/ప్లంబర్ | 598 |
అసిస్టెంటెట్ కమిషనర్ (ఫైనాన్స్) | 2 పోస్టులు |
సెక్షన్ ఆఫీసర్ | 30 పోస్టులు |
లీగల్ అసిస్టెంట్ | 1 పోస్టు |
ASO | 55 పోస్టులు |
పర్సనల్ అసిస్టెంట్ | 25 పోస్టులు |
కంప్యూటర్ ఆపరేటర్ | 8 పోస్టులు |
స్టెనోగ్రాఫర్ | 49 పోస్టులు |
నవోదయ స్కూల్ సమితి రిక్రూట్మెంట్ క్వాలిఫికేషన్ (Navodaya School Samithi Recrutiment Qualification)
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కొన్ని అర్హత ప్రమాణాలు ఉండాలి. ఆ అర్హతలు ఉన్న వ్యక్తులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీటీ (కంప్యూటర్ సైన్స్) ఉద్యోగాలకు అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్‌లో ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంటెక్ చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఈడీ కూడా తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి.- పీజీటీ(ఫిజికల్ ఎడ్యుకేషన్) ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు M.P.Ed క్వాలిఫై అయి ఉండాలి. వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి.
- PGT (మోడ్రన్ ఇండియన్ లాంగ్వేజ్) ఉద్యోగాలకు అభ్యర్థులు సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. బీఈడీ కూడా పాసై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లలోపు ఉండాలి.
- టీజీటీ (కంప్యూటర్ సైన్స్) ఉద్యోగాలకు అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్‌లో బీసీఏ/బీఎస్సీ చదివి ఉండాలి. లేదా బీటెక్‌లో సీఎస్/ఐటీ పూర్తిచేసి ఉండాలి. బీఈడీ, సీటెట్ తప్పనిసరిగా క్వాలిఫై అయి ఉండాలి. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
- టీజీటీ(ఆర్ట్) పోస్టులకు అభ్యర్థులు ఫైన్ ఆర్ట్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. బీఈడీ క్వాలిఫై అవ్వడం తప్పనిసరి. వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
- టీజీటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తుదారులు B.P.Ed పూర్తిచేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలి. అలాగే టీజీటీ (సంగీతం) ఉద్యోగాలకు అభ్యర్థులు
- సంగీతంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. వారి వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి. ఇలా పోస్ట్‌ను బట్టి అర్హత ప్రమాణాలు, వయో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి.
నవోదయ స్కూల్ సమితి రిక్రూట్మెంట్ అప్లికేషన్ విధానం (Navodaya School Samithi Recrutiment Application Process)
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేసుకునే విధానం గురించి ఈ దిగువున తెలుసుకోండి.
- ముందుగా నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్సైట్ navodaya.gov.inని సందర్శించాలి. హోంపేజీలోకి వెళ్లి అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయాలి. దాంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆ పేజీలో అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ ఐడీ, పాస్వర్డ్ సహాయంతో లాగిన్ అవ్వాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో ఉద్యోగాల వివరాలు పరిశీలించి నచ్చిన పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి, అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూతో సెలక్ట్ చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వంటి వివరాలతో త్వరలో మరో నోటిఫికేషన్ విడుదలవుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.