రైల్వే శాఖలో 41,500 పోస్టులు, పరీక్ష తేదీల్లో మార్పు.. కొత్త తేదీలు ఇక్కడ చూడండి (RRB Exam Dates 2024 Revised Again)
రైల్వే శాఖలో పలు ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీల్లో మళ్లీ మార్పులు జరిగాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సవరించిన కొత్త తేదీలను (RRB Exam Dates 2024 Revised Again) రిలీజ్ చేసింది.
మారిన RRB ఎగ్జామ్ డేట్స్ 2024 (RRB Exam Dates 2024 Revised Again) : రైల్వే శాఖలో 41,500 ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సవరించిన కొత్త తేదీలను (RRB Exam Dates 2024 Revised Again) విడుదల చేసింది. RPF SI, JE, టెక్నీషియన్, ఇతర పోస్టుల కోసం పరీక్ష తేదీలు సవరించబడ్డాయి. అయితే పరీక్ష తేదీలను సవరించడం ఇది రెండోసారి. అక్టోబర్‌లో RRBలు వాటిని సవరించాయి. మార్చిన పరీక్ష షెడ్యూల్ ప్రకారం CEN RPF 01/2024 RPF SI పరీక్ష డిసెంబర్ 2, 3, 9, 12, 13, 2024 తేదీల్లో జరుగుతుంది. CEN 03/2024 JE & అదర్స్ పరీక్ష డిసెంబర్ 16, 17, 18న నిర్వహించబడుతుంది. CEN 02/2024 టెక్నీషియన్ (గ్రేడ్ I) (గ్రేడ్ III) పరీక్ష డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29, 2024 తేదీల్లో జరుగుతుంది.
రివైజ్డ్ ఆర్‌ఆర్‌బీ రాత పరీక్ష తేదీల వివరాలు (RRB Exam Dates 2024)
దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో 18799 పోస్టుల భర్తీకి ఈ నియామక పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్‌ఐ, టెక్నీషియన్, జూనియర్ ఇంజనీర్ పోస్టులున్నాయి. అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ ఎస్ఐ, టెక్నిషియన్, జూనియర్ ఇంజనీర్ పోస్టులకు దరఖాస్త ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. టెక్నీషియన ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ కొనసాగుతోంది. పదో తరగతి, ఐటీఐ, డిప్లమా, ఇంటర్మీడియట్, డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు.- అసిస్టెంట్ లోకో పైలట్ (సీబీటీ-1)- నవంబర్ 25, 26, 27, 28, 29
- RPF SI - డిసెంబర్ 2, 3, 9, 12, 13
- టెక్నీషియన్ (గ్రేడ్-1, 3)- డిసెంబర్ 19, 20, 23, 24, 26, 28, 29
- జూనియర్ ఇంజనీర్- డిసెంబర్ 16, 17, 18
RRB పరీక్ష తేదీలు 2024: నోటీసును డౌన్‌లోడ్ చేయడం ఎలా? (RRB Exam Dates 2024: How to download notice)
పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు దిగువున ఇవ్వబడిన దశలను అనుసరించడం ద్వారా నోటీసును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.- ముందుగా అభ్యర్థులు RRBల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
- RRB పరీక్ష తేదీలు 2024 అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సవరించిన నోటీసు హోంపేజీలో అందుబాటులో ఉంటుంది.
- అభ్యర్థులు పరీక్ష తేదీలను చెక్ చేసే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- పేజీని డౌన్‌లోడ్ చేయండి. తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని దగ్గరే ఉంచుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.