SRMJEEE 2023 Phase 2 Registration: ఈరోజుతో ముగియనున్న SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ ప్రక్రియ
SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ (SRMJEEE 2023 Phase 2 Registration) ప్రక్రియ ఈరోజుతో (జూన్ 05, 2023) ముగియనుంది. ఈ ప్రవేశ పరీక్ష జూన్ 10, 11 2023వ తేదీల్లో జరుగుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
SRMJEEE 2023 ఫేజ్ 1 రిజిస్ట్రేషన్ (SRMJEEE 2023 Phase 2 Registration): SRMJEEE దరఖాస్తు ఫార్మ్ 2023 ఫేజ్ 2కి (SRMJEEE 2023 Phase 2 Registration) చివరి తేదీ ఈరోజే (జూన్ 5, 2023). అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసే ముందు SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాలి. ఫేజ్ 2 SRMJEEE 2023 పరీక్ష జూన్ 10, 11 2023లో రిమోట్ ప్రొక్టార్డ్ ఆన్లైన్ మోడ్‌లో నిర్వహించబడుతుంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
SRMJEEE 2023 ఎగ్జామ్ హైలెట్స్ (SRMJEEE 2023 Exam Highlights)
SRMJEEE 2023 పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దిగువున అందజేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్ | వివరాలు |
కండక్టింగ్ బాడీ | SRM ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ |
మోడ్ ఆఫ్ అప్లికేషన్ | ఆన్లైన్ |
అప్లికేషన్ ఫీజు | రూ.1200 |
SRMJEEE 2023 ఎగ్జామ్ డేట్ | ఫేజ్ 1 ఏప్రిల్ 21 నుంచి 23, 2023 ఫేజ్ 2 జూన్ 10 నుంచి 11, 2023 ఫేజ్ 3 జూలై 3 నుంచి 23, 2023 |
ఎగ్జామ్ డ్యురేషన్ | రెండు గంటల 30 నిమిషాలు |
కాంటాక్ట్ వివరాలు | హెల్ప్ డెస్క్ 08069087000, సోమవారం నుంచి శనివారం (9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు) |
మెయిల్ అడ్రస్ | admissions.india@srmist.edu.in |
SRMJEEE 2023 అర్హత ప్రమాణాలు (SRMJEEE 2023 Eligibility Criteria)
SRMIST అధికారిక నోటిఫికేషన్‌తో SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను విడుదల చేసింది. అభ్యర్థులు SRMJEEE 2023 అర్హత ప్రమాణాలను జాగ్రత్తగా చదివి అనుసరించాలి.- SRM ఇంజనీరింగ్ పరీక్ష 20233కి అర్హత పొందేందుకు అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశంలో నివాసితులు, లేదా ప్రవాస భారతీయులు (NRIలు), GOI జారీ చేసిన PIO లేదా OCI కార్డ్ హోల్డర్లు అయి ఉండాలి.
- అభ్యర్థులు 10వ తరగతిలో 60 శాతం స్కోర్ లేదా తత్సమాన స్కోర్‌ను కలిగి ఉండాలి.
- అభ్యర్థి తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో హయ్యర్ సెకండరీ పరీక్ష (10+2) / ఇంటర్మీడియట్లో 60 శాతం లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి.
- ఇంటర్నేషనల్ బాకలారియేట్ (IB) డిప్లొమా లేదా IB సర్టిఫికెట్ లేదా యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ జనరల్ సర్టిఫికెట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (GCE) A- లెవెల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ తప్పనిసరి సబ్జెక్టులుగా ఒక అభ్యర్థి 60 శాతం లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేసి ఉండాలి.
- ఇంటర్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే అభ్యర్థులు తప్పనిసరిగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 60% లేదా తత్సమాన గ్రేడ్ స్కోర్ చేయాలి.
- అభ్యర్థుల వయస్సు జూలై 31 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.
- భారతదేశంలోని అన్ని సెంట్రల్, స్టేట్ బోర్డ్‌లలో మొదటి ర్యాంక్ హోల్డర్లకు ఇన్స్టిట్యూట్ డైరెక్ట్ అడ్మిషన్, స్కాలర్షిప్లను అందిస్తోంది. తమిళనాడులోని IIT JEEలో మొదటి 1000 మంది ర్యాంకర్లు, ప్రతి ఒక్కరు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆదర్శప్రాయమైన క్రీడాకారులు నేరుగా ప్రవేశానికి అర్హులు.