అతి త్వరలో SSC CGL టైర్ 1 ఫలితాలు 2024 (SSC CGL Tier I Results 2024)
SSC CGL టైర్ 1 ఫలితం 2024 త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని చెక్ చేస్తూ ఉండాలని సూచించారు. SSC CGL ఫలితం 2024 అప్‌డేట్‌లను, అంచనా కటాఫ్‌ని చెక్ చేయండి.
SSC CGL టైర్ ఫలితాలు 2024 (SSC CGL Tier I Results 2024): SSC CGL టైర్ 1 ఫలితం 2024 త్వరలో విడుదలవుతుంది. ఫలితాల తేదీకి సంబంధించి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ, నవంబర్ మధ్య నాటికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ CGL ఫలితాలను (SSC CGL Tier I Results 2024) విడుదల చేసే అవకాశం ఉంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు అప్‌డేట్‌ల కోసం అధికారిక వెబ్‌సైట్ ssc.gov.inని చెక్ చేస్తుండాలి. SSC CGL ఫలితం 2024 అప్‌డేట్‌లను, అంచనా కటాఫ్‌లను చెక్ చేయండి.
SSC గ్రూప్ B, గ్రూప్ C కోసం 17727 పోస్టులను భర్తీ చేయడానికి SSC CGL టైర్ 1 పరీక్ష 2024 సెప్టెంబర్ 9 నుంచి 26 వరకు జరిగింది. ఈ పరీక్ష అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (AAO), జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్- గ్రేడ్ II, ఇతర పోస్ట్‌ల కోసం నిర్వహించడం జరిగింది. టైర్ 1 పరీక్ష ప్రశ్నపత్రంలో ఆబ్జెక్టివ్-టైప్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్‌పై బహుళ-ఎంపిక ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక్కో విభాగంలో గరిష్టంగా 50 మార్కులకు 25 ప్రశ్నలు ఉండేవి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ మినహా ఇంగ్లీషు, హిందీలో ప్రశ్నలు సెట్ చేయబడ్డాయి. ర్ 1 పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు టైర్ 2 పరీక్షకు హాజరవుతారు.
SSC CGL ఫలితం 2024 కటాఫ్ (SSC CGL Result 2024 Cut off)
ఫలితంతో పాటు, SSC పోస్ట్ వారీగా CGL కటాఫ్ మార్కులను కూడా విడుదల చేస్తుంది. స్టాటిస్టిక్స్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (JSO), స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ Gr II, ఫైనాన్స్/ఇతర పోస్టులకు కటాఫ్ మార్కులు విడిగా విడుదల చేయబడతాయి.SSC CGL టైర్ 1 ఆన్సర్ కీ అక్టోబర్ 3న విడుదలైంది. అభ్యంతరాల విండో అక్టోబర్ 3న ఓపెన్ అయి అక్టోబర్ 6న క్లోజ్ అయింది. ఈ పరీక్షలో పాస్ అవ్వడానికి అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు 30 శాతం, OBC మరియు EWS అభ్యర్థులకు 25 శాతం ఇతర అన్ని వర్గాలకు చెందిన అభ్యర్థులకు 20 శాతం మార్కులు అవసరం.
SSC CGL ఫలితాలను 2024 ఎలా చెక్ చేసుకోవాలి? (SSC CGL RESULT 2024: HOW TO CHECK)
SSC CGL ఫలితాలను 2024 ఈ దిగువున తెలిపిన విధంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.- ముందుగా అభ్యర్థులు ssc.gov.in వద్ద అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శంచాలి.
- ఫలితాల విభాగానికి నావిగేట్ అవ్వాలి. పరీక్ష పేరును ఎంచుకోవాలి.
- టైర్ 1 రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ ఆధారాలను నమోదు చేయాలి.
- మీ ఫలితాన్ని వీక్షించడానికి వివరాలను సబ్మిట్ చేయాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.