SSC GD ఎగ్జామ్ ఆన్సర్ కీ 2024ని ఎలా చెక్ చేసుకోవాలి? (SSC GD RE Exam Answer Key 2024)
SSC GD రీ ఎగ్జామ్ మార్చి 30న జరగనుంది. దీనికి సంబంధించిన ఆన్సర్ కీ (SSC GD RE Exam Answer Key 2024) విడుదలైంది. ఆన్సర్ కీని చెక్ చేయడానికి, అభ్యర్థులు ఇక్కడ అందించిన విధానాన్ని అనుసరించవచ్చు.
ఎస్‌ఎస్‌సీ జీడీ ఎగ్జామ్ ఆన్సర్ కీ 2024 (SSC GD RE Exam Answer Key 2024) : CISF, CRPF, ITBP, BSF, AR, SSB, SSFతో సహా వివిధ దళాలలో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ కోసం 26,146 ఖాళీలను భర్తీ చేయడానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంప్యూటర్ ఆధారిత రీ ఎగ్జామ్‌ని నిర్వహించింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు అధికారిక ఆన్సర్ కీ (SSC GD RE Exam Answer Key 2024) కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఆన్సర్ కీ విడుదలైంది.. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆన్సర్ కీ కోసం ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.ssc.gov.inని చెక్ చేస్తుండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి :SSC GD ఎగ్జామ్ ఆన్సర్ కీ విడుదల, ఇదే లింక్
ఎస్‌ఎస్‌సీ జీడీ ఆన్సర్ కీ 2024 (SSC GD Answer Key 2024)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 81 పరీక్షా కేంద్రాల్లో 16,185 మంది అభ్యర్థులకు మార్చి 30, 2024న పునఃపరీక్షను నిర్వహించింది. ఫిబ్రవరి 20, మార్చి 7, 2024 మధ్య నిర్దిష్ట కేంద్రాలలో కానిస్టేబుల్ (GD) కోసం మునుపటి కంప్యూటర్ ఆధారిత పరీక్షకు హాజరైన వారు మాత్రమే తిరిగి పరీక్షకు అర్హులయ్యారు. ఈ పరీక్ష పూర్తైన తర్వాత SSC GD ఆన్సర్ కీ (SSC GD RE Exam Answer Key 2024) ఈ నెల మొదటి వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు ఆన్సర్ కీకి సంబంధించిన అప్‌డేట్ల కోసం ఇక్కడ చూస్తుండండి.SSC GD ఆన్సర్ కీ 2024 డౌన్‌లోడ్ చేసుకునే విధానం (Step to Download SSC GD Answer Key 2024)
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ నుంచి SSC GD ఆన్సర్ కీ 2024ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు దిగువ పేర్కొన్న దశలను అనుసరించవచ్చు.- స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు ssc.gov.inలో అధికారిక SSC వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- స్టెప్ 2: మీరు హోంపేజీకి చేరుకున్న తర్వాత "ఆన్సర్ కీ" విభాగానికి నావిగేట్ అవ్వాలి.
- స్టెప్ 3: “జనరల్ డ్యూటీ కానిస్టేబుల్- 2024 కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఆన్సర్ కీలను అప్‌లోడ్ చేయడం” అనే నోటీసు కోసం వెదికి దానిపై క్లిక్ చేయండి.
- స్టెప్ 4: తర్వాత పేజీలో “అభ్యర్థుల రెస్పాన్స్ షీట్, తాత్కాలిక ఆన్సర్ కీలు, ప్రాతినిధ్య సమర్పణ కోసం లింక్” అని ఉండే ఆప్షన్‌ను గుర్తంచి దానిపై క్లిక్ చేయండి.
- స్టెప్ 5: మీరు పాల్గొన్న నిర్దిష్ట పరీక్షను ఎంచుకోండి.
- స్టెప్ 6: కచ్చితమైన రెస్పాన్స్‌ని కలిగి ఉన్న ఆన్సర్ కీని యాక్సెస్ పొందడానికి మీ లాగిన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- స్టెప్ 7: దీన్ని యాక్సెస్ చేసిన తర్వాత, మీరు మీ భవిష్యత్తు సూచన కోసం సమాధాన కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.