ఏపీ EAMCET (ఎంసెట్) 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ ( AP EAPCET 2023 Application Release Date) : రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది.
ఏపీ ఎంసెట్ 2023 (AP EAPCET 2023) అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్న విద్యార్థులు sche.ap.gov.in అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల తేదీ ( AP EAPCET 2023 Application Release Date) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు ఇంజనీరింగ్ , మెడిసిన్ , అగ్రికల్చర్ కోర్సులలో జాయిన్ అవ్వడానికి వ్రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ AP EAPCET. గతంలో ఉన్న ఎంసెట్ ( AP EAMCET) పేరును అధికారులు AP EAPCET గా మార్చారు. ప్రతీ సంవత్సరం సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కు హాజరు అవుతారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో సీట్ల భర్తీ కోసం ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి నెలలో విడుదల అవుతుంది, విద్యార్థులు అధికారిక వెబ్సైట్ sche.ap.gov.in లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఏపీ ఎంసెట్ 2023 ( AP EAMCET 2023) పరీక్ష మే 15వ తేదీ నుండి 22వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ కు , మే 23 నుండి 25 వరకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ కు పరీక్షలు జరుగుతాయి.
ఏపీ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల, రిజిస్ట్రేషన్ ఫీజు, పరీక్ష తేదీల గురించి మరింత ముఖ్యమైన సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
ఇవి కూడా చదవండి - ఏపీ ఎంసెట్ 2023 పరీక్ష తేదీలు
ఏపీ ఎంసెట్ 2023 ముఖ్యమైన తేదీలు ( AP EAPCET 2023 Important Dates)
ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2023 (AP EAMCET 2023 Application) కు సంబందించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో వివరంగా తెలుసుకోవచ్చు.
కార్యక్రమం | తేదీ |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) నోటిఫికేషన్ | ఫిబ్రవరి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) రిజిస్ట్రేషన్ ప్రారంభం | ఫిబ్రవరి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) రిజిస్ట్రేషన్ చివరి తేదీ | మార్చి 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) హాల్ టికెట్ విడుదల | ఏప్రిల్ 2023 |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) పరీక్ష తేదీలు | మే15 నుండి 25 వరకు |
ఏపీ ఎంసెట్ (AP EAPCET) కౌన్సెలింగ్ | జూన్ / జూలై 2023 |
ఏపీ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ ఫీజు ( AP EAMCET 2023 Registration Fee)
ఏపీ ఎంసెట్ 2023 కు రిజిస్టర్ చేసుకుంటున్న అభ్యర్థులు చెల్లించాల్సిన ఫీజు వివరాలు కేటగిరీ ప్రకారంగా క్రింద పట్టిక లో తెలుసుకోవచ్చు.
కేటగిరీ | ఇంజనీరింగ్ | అగ్రికల్చర్ | ఫార్మసీ |
జనరల్ అభ్యర్థులు | 600 /- | 600/- | 600/- |
BC | 500/- | 500/- | 500/- |
SC / ST | 300/- | 300/- | 300/- |
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు కూడా ఏపీ ఎంసెట్ పరీక్ష కు అప్లై చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి - ఏపీ ECET 2023 ఎగ్జామ్ షెడ్యూల్
ఏపీ ఎంసెట్ గురించిన మరిన్ని వివరాల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.