సీయూఈటీ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్ (CUET UG 2023 Application) విడుదల తేదీ: రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుంది
దేశంలో సెంట్రల్ యూనివర్సిటీల్లోని డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సీయూఈటీ యూజీని నిర్వహించడం జరుగుతుంది. సీయూఈటీ యూజీ 2023 అప్లికేషన్ (CUET UG 2023 Application) ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల అవుతుంది. సీయూఈటీ యూజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు.
సీయూఈటీ యూజీ 2023 (CUET UG 2023 Application): సీయూఈటీ యూజీ (Common University Entrance Test UG) ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సెంట్రల్ యూనివర్సిటీల్లో అడ్మిషన్లు జరుగుతాయి. ఈ సీయూఈటీ యూజీ అప్లికేషన్ (CUET UG 2023 Application) ఫిబ్రవరి మొదటి వారంలో విడుదల కానుంది. అప్పటి నుంచే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలవుతుంది. సీయూఈటీ యూజీ (CUET UG 2023) అధికారిక వెబ్‌సైట్ cuet.samarth.ac.inలో సంబంధిత అప్లికేషన్ (CUET 2023 Application) అందుబాటులో ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హతలను చూసుకుని దరఖాస్తు చేసుకోవచ్చు. సీయూఈటీ యూజీ (CUET UG 2023)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) నిర్వహిస్తుంది.CUET UG 2023 పరీక్షలు మే 21 నుంచి 31వ తేదీ మధ్య జరగనున్నాయి.
సీయూఈటీ అప్లికేషన్ 2023 ముఖ్యమైన తేదీలు (CUET Application 2023 Important Dates)
అభ్యర్థులకు సీయూఈటీ యూజీ (CUET UG 2023) అప్లికేషన్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అందుబాటులో ఉండనుంది. దరఖాస్తుకు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.కార్యక్రమం | ముఖ్యమైన తేదీలు |
అప్లికేషన్ | 2023 ఫిబ్రవరి మొదటి వారం |
అప్లికేషన్ లాస్ట్ డేట్ | తెలియాల్సి ఉంది |
అప్లికేషన్‌లో తప్పులు సరిచేసుకునుట | తెలియాల్సి ఉంది |
దరఖాస్తు ఫీజు లాస్ట్ డేట్ | తెలియాల్సి ఉంది |
సీయూఈటీ 2023 ఎగ్జామ్ డేట్ | మే 21 నుంచి 30, 2023 |
సీయూఈటీ 2023 ఆన్సర్ కీ విడుదల | తెలియాల్సి ఉంది |
CUET దరఖాస్తు 2023ని ఎలా పూరించాలి..? (How to fill CUET Application Form 2023)
సీయూఈటీ యూజీ (CUET UG 2023) రిజిస్ట్రేషన్ ప్రోసెస్ గురించి స్పష్టంగా ఈ ఆర్టికల్లో తెలుసుకోవచ్చు. CUET UG 2023 అప్లికేషన్‌ను వివిధ దశల్లో ఎలా పూరించాలనే వివరాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది.
- రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అభ్యర్థులు cuet.samarth.ac.in లో వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- లాగిన్ అయ్యేందుకు మొదట అభ్యర్థులు తమ వివరాలను ఇవ్వాలి.
- రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ డిటైల్స్ పొందుతారు.
- అభ్యర్థులు వాటి ద్వారా లాగిన్ అయి CUET దరఖాస్తును పూరించాలి. అప్లికేషన్‌లో అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలతో పాటు, విద్యా సంబంధిత వివరాలు ఇచ్చి అప్లికేషన్ ఫిల్ చేయాలి.
- ఫోటో, సంతకం, 12వ తరగతి మార్క్ షీట్‌ను అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
- భవిష్యత్ అవసరాల నిమిత్తం అప్లికేషన్ ప్రింట్‌ను తీసుకుని భద్రపరుచుకోవాలి.
సీయూఈటీ యూజీ (CUET 2023)కి సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoని చూస్తూ ఉండండి.