JEE మెయిన్ 2023 సెషన్ 1: మొదటి రోజు క్వశ్చన్ పేపర్ (JEE Main 2023 Question Paper Analysis) తేలికగా ఉందా లేదా కష్టంగా ఉందా ? ఇక్కడ తెలుసుకోండి.
జేఈఈ మెయిన్ 2023 సెషన్ 1 (JEE Main Question Paper Analysis 2023) పరీక్ష కొంచెం మధ్యస్థ స్థాయి నుంచి కష్టంగా ఉందని తెలుస్తుంది. పరీక్షా పేపర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్లో విశ్లేషించాం. పరీక్షలో ఇచ్చిన ప్రశ్నలపై విద్యార్థులు ఏ విధంగా స్పందిస్తున్నారో ఇక్కడ తెలుసుకోవచ్చు.
JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష (JEE Main January 24 2023 Question Paper Analysis): JEE మెయిన్ 2022 మొదటి రోజు 24 జనవరి 2023 షిఫ్ట్ 1 ప్రశ్నా పత్రం ఎనాలిసిస్ (JEE Main January 24 2023 Question Paper Analysis) ఇక్కడ అందుబాటులో ఉంది. విద్యార్థుల అభిప్రాయాలు, స్పందన ఆధారంగా ఈ విశ్లేషణను అందించడం జరిగింది. ఓవరాల్‌గా జనవరి 24 జేఈఈ మొదటి సెషన్ పేపర్ మోడరేట్ నుంచి కొంచెం కష్టంగా ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా ఫిజిక్స్ నుంచి ఇచ్చిన ప్రశ్నలు చాలా కష్టంగా , కెమిస్ట్రీ నుంచి ఇచ్చిన ప్రశ్నలు మోడరేట్ నుంచి కష్టంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు. గణితం నుంచి ప్రశ్నలు సులభంగా ఉన్నట్టు విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
JEE మెయిన్ 24 జనవరి 2023 షిఫ్ట్ (JEE Main January 24 2023 Question Paper Analysis) 1 పరీక్ష ఉదయం 9:00 నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరిగింది. షిఫ్ట్ 1 ప్రశ్న పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ నుంచి మొత్తం 90 ప్రశ్నలు ఉన్నాయి. ఇంకా ప్రశ్నపత్రం ఫార్మాట్ MCQ ఫార్మాట్‌లో ఉంది. అధికారిక JEE మెయిన్ 2023 జవాబు కీ తేదీ సెషన్ 1 పరీక్ష ముగిసిన మూడు రోజుల్లోపు విడుదల చేసే అవకాశం ఉంది.
JEE మెయిన్ సెషన్ 1 పరీక్ష పేపర్‌పై ముఖ్యమైన అంశాలు (Major Highlights of JEE Main Session 1 Exam Paper)
- పేపర్ మోడరేట్ నుంచి కష్టంగా ఉన్నట్టు తెలుస్తుంది
- ఫిజిక్స్‌కు సంబంధించిన ప్రశ్నలు చాలా కష్టంగా ఇవ్వడం జరిగింది.
- మ్యాథ్స్ నుంచి సులభమైన ప్రశ్నలు ఇవ్వడం జరిగింది.
- కెమిస్ట్రీ నుంచి మోడరేట్ నుంచి కష్టమైన ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు అభిప్రాయపడ్డారు.
- కెమిస్ట్రీ అధ్యాయంలో మెమరీ ఆధారిత డైరక్ట్ NCERT ప్రశ్నలు ఇచ్చారు.
- ఆర్గానిక్ కెమిస్ట్రీలో కెమిస్ట్రీ విభాగంలో సంఖ్యాపరమైన ప్రశ్నలు ఉన్నాయి
- ఫిజిక్స్ విభాగంలో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఫోములా ఆధారిత ప్రశ్నలు ఉన్నాయి
- గణిత విభాగంలో వెక్టర్ 3D అధ్యాయం నుంచి చాలా ప్రశ్నలు ఉన్నాయి
- గణిత విభాగం NAT ప్రశ్నలు lengthy,గా, MCQ భాగం మోడరేట్‌గా ఉంది
- ఫిజిక్స్ విభాగంలో "ఫైండ్ ది టెన్షన్ ఆఫ్ ఎ స్ట్రింగ్" గణన ఆధారిత ప్రశ్న ఉంది
JEE మెయిన్ 24 జనవరి 2023 షిఫ్ట్ 1 పరీక్ష విశ్లేషణ (JEE Main 24 January 2023 Shift 1 Exam Analysis)
జేఈఈ మెయిన్ 2023కి (JEE Main 2023) షిఫ్ట్ 1కు సంబంధించిన పరీక్ష విశ్లేషణ ఈ దిగువున ఇవ్వడం జరిగింది. విద్యార్థులు, నిపుణుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ఎనాలిసిస్‌ను అందించడం జరిగింది.
సెక్షన్ | వివరాలు |
మొత్తంగా క్లిష్టత స్థాయి | మోడరేట్ |
ఫిజిక్స్ పేపర్ క్లిష్టత స్థాయి | చాలా కష్టంగా ఉంది |
కెమిస్ట్రీ పేపర్ క్లిష్టత స్థాయి | కొంచెం కష్టంగా ఉంది |
గణితం పేపర్ క్లిష్టత స్థాయి | సులభంగా ఉంది |
NAT ప్రశ్నల క్లిష్టత స్థాయి | తెలియాల్సి ఉంది |
గణితంలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ | వెక్టర్ ఆల్జిబ్రా (Vector Algebra) 3డీ జామిట్రీ (3D Geometry) అనుసంధానం (Integration) సమగ్ర కాలిక్యులేస్ (Integral Calculus) త్రికోణమితి (Trigonometry) |
ఫిజిక్స్‌లో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ | గతి శాస్త్రం (Kinematics) యూనిట్లు, కొలతలు (Units & Dimensions) సెమి కండక్టర్స్ (Semiconductors) కమ్యూనికేషన్ వ్యవస్థలు (Communication systems) విద్యుదయస్కాంత తరంగాలు (Electromagnetic waves) |
కెమిస్ట్రీలో ఎక్కువ వెయిటేజీ ఉన్న టాపిక్స్ | జీవ అణువులు (Biomolecules) అకర్భన రసాయన శాస్త్రం (Inorganic Chemistry) కర్భన రసాయన శాస్త్రం (Organic Chemistry) ఫిజికల్ కెమిస్ట్రీ (Physical Chemistry) అకర్భన (Inorganic) పాలిమర్లు (Polymers) |
జేఈఈ మెయిన్ 2023 (JEE Main 2023) పరీక్షలకు సంబంధించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం College Dekhoను చూడవచ్చు.