తెలంగాణలో ఉద్యోగాలు, నెలకు రూ.25,000 జీతం, 30న చివరి తేదీ (TGCAB DCCB Recruitment 2024)
తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB DCCB Recruitment 2024) నుంచి పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి, అర్హతలున్న అభ్యర్థులు ఈ నెల 30వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి.
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 (TGCAB DCCB Recruitment 2024): తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB) రాష్ట్రంలో కో ఆపరేటివ్ ఇంటర్న్స్ (CIలు) పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10 పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 30వ తేదీనే చివరి తేదీ. ఈ పోస్టుల కోసం అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో.. ఎలా దరఖాస్తు చేసుకోవాలో వంటి పూర్తి వివరాలు ఇక్కడ అందించాం.
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం ఖాళీల సంఖ్య (TGCAB DCCB Recruitment 2024 Total Vacancies)
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 మొత్తం ఖాళీల సంఖ్య ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB) | 01 |
తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ (TGCAB): జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (DCCB) | 09 |
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 అర్హతలు (TGCAB DCCB Recruitment 2024 Eligibility)
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024కు సంబంధించిన అర్హత ప్రమాణాలు ఈ దిగువున అందించాం. అభ్యర్థులు చూడవచ్చు.- కోఆపరేటివ్ మేనేజ్‌మెంట్, అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్, రూరల్ డెవలప్‌మెంట్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఎంబీఏ చేసి ఉండాలి. లేదా AICTE/UGCచే గుర్తింపు పొందిన 2 సంవత్సరాల PGDMలో తత్సమానం పొంది ఉండాలి.
- కంప్యూటర్ వినియోగం, తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి.
- అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- ఈ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులకు నెలకు రూ.25 వేల రూపాయల వరకు వేతనం ఉంటుంది.
TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024 ఎంపిక ప్రక్రియ (TGCAB DCCB Recruitment 2024 Selection Process)
ఈ పోస్టులకు అభ్యర్థులను SSC, 12వ, గ్రాడ్యుయేషన్, పోస్ట్-గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కులు, ఏదైనా అదనపు అర్హతల నుంచి తీసుకోబడిన మెరిట్ జాబితా ఆధారంగా ఎంపిక చేయబడతారు. తుది ఎంపిక కోసం డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.TGCAB DCCB రిక్రూట్‌మెంట్ 2024కు ఎలా అప్లై చేసుకోవాలి? (TGCAB DCCB Recruitment 2024 How to Apply)
ఈ పోస్టులకు అభ్యర్థులు కేవలం ఆఫ్‌లైన్ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులు తమ దరఖాస్తులను డిప్యూటీ జనరల్ మేనేజర్, HR నిర్వహణ విభాగం, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, 4-1-441, ట్రూప్ బజార్, హైదరాబాద్ - 500 001 అనే అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. TGCAB ప్రధాన కార్యాలయం, హైదరాబాద్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.