TS CET Exam Dates 2024: తెలంగాణ ప్రవేశ పరీక్షల 2024 తేదీలు విడుదల, ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, ఎడ్‌సెట్‌ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
TS ICET, TS ECET, TS PGECET, TS EDCET, TS PECET పరీక్షా తేదీలతో సహా 2024 తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష తేదీలను (TS CET Exam Dates 2024) TSCHE ప్రకటించింది. అన్ని TS CETలు 2024కి సంబంధించిన వివరణాత్మక షెడ్యూల్ ఇక్కడ ఉంది.
TS CET పరీక్ష తేదీలు 2024 (TS CET Exam Dates 2024): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) తెలంగాణ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ 2024 అధికారిక పరీక్ష తేదీలను (TS CET Exam Dates 2024) విడుదల చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం, TS CET పరీక్షలు మే 9 నుంచి జూన్ 13 వరకు నిర్వహించబడతాయి. ఈ ప్రవేశ పరీక్షలు ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, బి.టెక్ లేటరల్ ఎంట్రీ, బి.ఎడ్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఎం.టెక్, ఎంసీఏ వంటి వివిధ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత ఫార్మాట్‌లో జరుగుతాయి. ఈ పరీక్షలన్నింటికీ అధికారిక నోటిఫికేషన్, దరఖాస్తు ఫార్మ్ నిర్ణీత సమయంలో విడుదల చేయబడుతుంది.
TS CET పరీక్ష తేదీలు 2024: పరీక్షల వారీగా షెడ్యూల్ (TS CET Exam Dates 2024: Exam-wise schedule)
TS CET పరీక్షల 2024 పరీక్షల వారీ షెడ్యూల్ ఇక్కడ ఉంది -పరీక్ష పేరు | పరీక్ష తేదీ | కోర్సులు |
TS EAMCET పరీక్ష తేదీ 2024 | మే 9 నుండి 13, 2024 వరకు | ఇంజనీరింగ్, ఫార్మసీ, వ్యవసాయం |
TS ECET పరీక్ష తేదీ 2024 | మే 6, 2024 | B.Tech లాటరల్ ఎంట్రీ |
TS ICET పరీక్ష తేదీ 2024 | జూన్ 4 & 5, 2024 | MBA, MCA |
TS PGECET పరీక్ష తేదీ 2024 | జూన్ 6 నుంచి 8, 2024 వరకు | ఎంటెక్ |
TS PECET పరీక్ష తేదీ 2024 | జూన్ 10 నుంచి 13, 2024 వరకు | ఫిజికల్ ఎడ్యుకేషన్ |
TS EDCET పరీక్ష తేదీ 2024 | మే 23, 2024 | బీఈడీ |
TS LAWCET పరీక్ష తేదీ 2024 | జూన్ 3, 2024 | LLB |
TSCHE జనవరి 25, 2024న ప్రెస్ మీటింగ్ ద్వారా పైన పేర్కొన్న అన్ని పరీక్షల తేదీలను అధికారికంగా తెలియజేసింది. అయితే, TSCHE LLB మరియు LLM కోర్సుల్లో ప్రవేశానికి TS LAWCET పరీక్ష తేదీ 2024ని కూడా వెల్లడించింది. TS LAWCET దరకాస్తుదారులు మార్చిలో దరఖాస్తు ఫార్మ్‌ను విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేయడానికి TSCHE త్వరలో ఈ అన్ని ప్రవేశ పరీక్షల కోసం అధికారిక పోర్టల్‌లను యాక్టివేట్ చేస్తుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.