రేపే ప్రారంభం కానున్న TS DEESET Counselling 2023, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి
రేపే ప్రారంభం కానున్న TS DEESET Counselling 2023, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఛాయిస్ ఫిల్లింగ్ మొదలైన తేదీలను ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకోవచ్చు.
TS DEESET కౌన్సెలింగ్ 2023 : తెలంగాణ డీసెట్ 2023 కౌన్సెలింగ్ రేపు ( 20 డిసెంబర్ 2023) తేదీ నుండి ప్రారంభం కానున్నది. తెలంగాణ డీసెట్ పరీక్ష జూన్ నెలలో జరగగా పరీక్ష జరిగిన ఆరు నెలలకు కౌన్సెలింగ్ ప్రారంభం అవుతున్నది. తెలంగాణ డీసెట్ కౌన్సెలింగ్ కోసం సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ 20 డిసెంబర్ 2023 తేదీ నుండి ప్రారంభం అవుతున్నది. డీసెట్ 2023 పరీక్షలో ర్యాంక్ సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కు హాజరు అవ్వాలి, సెర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి అయిన తర్వాత అభ్యర్థులు వారికి కేటాయించిన తేదీలలో వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలి.
తెలంగాణ డీసెట్ కౌన్సెలింగ్ 2023 ద్వారా అడ్మిషన్ సాధించిన అభ్యర్థుల కోసం 30 డిసెంబర్ తేదీన సీట్ అలాట్మెంట్ విడుదల చేయబడుతుంది. మెరిట్ జాబితా మరియు రిజర్వేషన్ కు అనుగుణంగా అభ్యర్థులకు డీసెట్ కు అడ్మిషన్ లభిస్తుంది. అడ్మిషన్ పొందిన అభ్యర్థులు అడ్మిషన్ ఫీజు చెల్లించి కళాశాలలో రిపోర్ట్ చేయాలి.
TS DEESET 2023 కౌన్సెలింగ్ తేదీలు 2023 (TS DEESET Counselling Dates 2023)
తెలంగాణ డీసెట్ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను క్రింది పట్టిక నుండి వివరంగా తెలుసుకోవచ్చు.కౌన్సెలింగ్ ప్రక్రియ వివరాలు | తేదీలు |
TS DEESET 2023 సర్టిఫికెట్ వెరిఫికేషన్ | 20 డిసెంబర్ 2023 |
TS DEESET 2023 వెబ్ ఆప్షన్స్ | 22 డిసెంబర్ 2023 నుండి 27 డిసెంబర్ 2023 వరకు |
TS DEESET 2023 సీట్ అలాట్మెంట్ విడుదల | 30 డిసెంబర్ 2023 |
TS DEESET 2023 ఫీజు చెల్లింపు | 01 జనవరి 2024 నుండి 03 జనవరి 2024 వరకు |
కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్ | 05 జనవరి 2024 |
తరగతులు ప్రారంభం | 08 జనవరి 2024 |
TS DEESET 2023 కు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఎడ్యుకేషనల్ వార్తల కోసం CollegeDekho ను ఫాలో అవ్వండి.