TS DEECET 2nd Phase Counselling Dates 2024: 17 నుంచి తెలంగాణ డీఈఈ సెట్ రెండో విడత కౌన్సెలింగ్
తెలంగాణ డీసెట్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు (TS DEECET 2nd Phase Counselling Dates 2024) విడుదలయ్యాయి. కౌన్సెలింగ్‌కు సంబంధించిన తేదీలను ఇక్కడ వివంగా అందజేశాం. అభ్యర్థులు చూడవచ్చు.
తెలంగాణ డీసెట్ రెండో ఫేజ్ కౌన్సెలింగ్ డేట్స్ (TS DEECET 2nd Phase Counselling Dates 2024): తెలంగాణలో డీఈఈ సెట్-2023 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ (TS DEECET 2nd Phase Counselling Dates) రిలీజ్ అయింది. ఈ షెడ్యూల్ ప్రకారం జనవరి 17వ తేదీ నుంచి డీఈఈ సెట్ రెండో విడత ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. ఈ విషయాన్ని కన్వీనర్ శ్రీనివాసచారి 11వ తేదీన ఒక ప్రకటనలో వెల్లడించారు.
కౌన్సెలింగ్ డేట్స్ ప్రకారం జనవరి 17న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జనవరి 18 నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. ఆప్షన్లు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులకు జనవరి 25న సీట్లు కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన అభ్యర్థులు జనవరి 26 నుంచి 29 మధ్య సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాలి. TS DEECET మొదటి విడత కౌన్సెలింగ్ ద్వారా మొత్తం 1152 మంది అభ్యర్థులు కళాశాలల్లో చేరారు. సీట్లు పొందినవారికి 2023-25 విద్యాసంవత్సరానికి గానూ డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
TS DEECET 2వ దశ కౌన్సెలింగ్ తేదీలు 2024 (TS DEECET 2nd Phase Counselling Dates 2024)
TS DEECET రెండో దశ కౌన్సెలింగ్ తేదీలను ఈ దిగువున టేబుల్లో చూడవచ్చు.TS DEECET 2024 ఫేజ్ 2 కౌన్సెలింగ్ 2023 ఈవెంట్స్ | తేదీలు |
TS DEECET 2024 సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రాసెస్ | జనవరి 17, 2024 |
TS DEECET 2024 వెబ్ ఆప్షన్ల సబ్మిషన్ ప్రారంభ తేదీ | జనవరి 18 , 2024 |
TS DEECET 2024 వెబ్ ఆప్షన్లు సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ | జనవరి 22, 224 |
TS DEECET 2024 ఫస్ట్ సీట్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ డేట్ | జనవరి 25, 2024 |
కాలేజీల్లో రిపోర్టింగ్ తేదీ | జనవరి 26 నుంచి 29, 2024 |
కాగా తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్హతతో డీఎడ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే 'DEECET-2023' కౌన్సెలింగ్‌లో ఆలస్యం జరిగింది. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. పరీక్షలో పాసైన అభ్యర్థులతోపాటు మేనేజ్మెంట్ కోటా కింద చేరాలనుకుంటున్న అభ్యర్థులు కన్వీనర్ కార్యాలయానికి ఫోన్లు కూడా చేశారు. కానీ సిబ్బంది స్పందించలేదు. ఎట్టకేలకు డిసెంబరు 20 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించారు.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయవచ్చు. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని పొందవచ్చు.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.