TS DOST Admission 2023 Dates: తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్లు, నేడే TS DOST 2023 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో డిగ్రీ అడ్మిషన్ కోసం TSCHE ఈరోజు TS DOST 2023 తేదీలని విడుదల ((TS DOST Admission 2023 Dates)) చేస్తుంది. TS DOST అనేది BA, B.Sc, B.Com, BBA, హోటల్ మేనేజ్‌మెంట్ మొదలైన UG కోర్సుల్లో అడ్మిషన్ కోసం నిర్వహించబడుతుంది.
TS DOST 2023 తేదీలు (TS DOST Admission 2023 Dates): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఈరోజు dost.cgg.gov.inలో TS DOST 2023 తేదీలని (TS DOST Admission 2023 Dates) విడుదల చేస్తుంది. విడుదలైన తర్వాత విద్యార్థులు ఇక్కడ వివరణాత్మక షెడ్యూల్‌ని చూడవచ్చు. TS DOST అనేది BA, B.Sc, B.Com, BBA మొదలైన వివిధ UG కోర్సుల్లో అడ్మిషన్ కోసం TSCHE ద్వారా నిర్వహించబడిన ఆన్‌లైన్ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ. అయితే B.Tech, B.ఫార్మసీ, నర్సింగ్, పారామెడికల్, B.Sc అగ్రికల్చర్ కోర్సులు TS DOSTలో చేర్చబడలేదు. తెలంగాణలోని అన్ని ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు TS DOST కౌన్సెలింగ్ 2023 ద్వారా విద్యార్థులను చేర్చుకుంటాయి.
TS DOST 2023 షెడ్యూల్ విడుదలైన తర్వాత ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
TS DOST అడ్మిషన్ ప్రక్రియ పూర్తిగా TS Inter resultsలో అభ్యర్థులు స్కోర్ చేసిన మార్కులు, ఎంచుకునే కళాశాల ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. TS DOST 2023 ద్వారా వివిధ UG కోర్సులు లో దాదాపు నాలుగు లక్షల సీట్లు అందుబాటులో ఉంటాయని అంచనా.
అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలని కోరుకునే అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి important instructions regarding TS DOST 2023 registrationని చెక్ చేయవచ్చు. TS DOST కౌన్సెలింగ్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్, ఛాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్, రిపోర్టింగ్ ప్రక్రియ ఉంటుంది. టీఎస్ దోస్త్ ద్వారా విద్యార్థులు తమకు నచ్చిన కాలేజీాలో, నచ్చిన కోర్సులో జాయిన్ అవ్వొచ్చు.
TS DOST అప్లికేషన్ ఫార్మ్ 2023లో UG కోర్సులను ఎంచుకోవడానికి ముందు, అభ్యర్థులు దాని కోసం తప్పనిసరిగా అర్హత ప్రమాణాలను చెక్ చేయాలి. ఉదాహరణకు, TS ఇంటర్ MPC విద్యార్థులు B.Sc జువాలజీ/ బోటనీకి అడ్మిషన్ తీసుకోవడానికి అర్హులు కాదు. అదేవిధంగా, TS ఇంటర్ బైపిసి విద్యార్థులు అడ్మిషన్ నుండి B.Sc గణిత శాస్త్రానికి సంబంధించిన కోర్సులు తీసుకోవడానికి అర్హులు కాదు. కాబట్టి, అప్లికేషన్ ఫార్మ్ లో పొరపాట్లను నివారించడానికి ముందుగా అర్హత ప్రమాణాలు ద్వారా వెళ్లడం మంచిది.
కోెర్సులు, ప్రవేశ పరీక్షలు, అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాల కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. అభ్యర్థులు ఈ లింక్‌పై ఎడ్యుకేషన్ వార్తలు క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. మీరు ఈ ఈ-మెయిల్ ID news@collegedekho.com. ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు.