ఈరోజు నుంచే తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు చేసుకోవచ్చు, అప్లై చేసుకునే విధానం ఇక్కడ తెలుసుకోండి (TS Dsc Registration Process 2024)
తెలంగాణ డీఎస్సీ 2024 దరఖాస్తు ప్రక్రియ (TS Dsc Registration Process 2024) ఈరోజు అంటే మార్చి 04, 2024 నుంచి ప్రారంభమైంది. మొత్తం 11062 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
తెలంగాన డీఎస్సీ 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ (TS DSC Registration Process 2024): పాఠశాల విద్యా శాఖ, తెలంగాణ ప్రభుత్వం 11,062 SGT, SA, లాంగ్వేజ్ పండిట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఖాళీలను భర్తీ చేయడానికి TS DSC నోటిఫికేషన్ 2024ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 11062 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ( (TS DSC Registration Process 2024)) ఈరోజు నుంచి అంటే మార్చి 04వ తేదీన ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 02, 2024 తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TS DSC రిక్రూట్మెంట్ 2024ని దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు ఉండాల్సిన అర్హత ప్రమాణాలను, ఇతర ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం.
టీఎస్ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు (TS DSC 2024 Notification- Important Dates)
టీఎస్ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.ఈవెంట్లు | ముఖ్యమైన తేదీలు |
టీఎస్ డీఎస్సీ నోటిఫికేషన్ 2024 | ఫిబ్రవరి 29, 2024 |
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ | మార్చి 04, 2024 |
తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుకు చివరి తేదీ | ఏప్రిల్ 02, 2024 |
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ | తెలియాల్సి ఉంది |
టీఎస్ డీఎస్సీ హాల్ టికెట్లు 2024 విడుదల తేదీ | తెలియాల్సి ఉంది |
టీఎస్ డీఎస్సీ పరీక్ష తేదీ 2024 | తెలియాల్సి ఉంది |
టీఎస్ డీఎస్సీ 2024కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? (How to Apply for TS DSC 2024?)
టీఎస్ డీఎస్సీ 2024కి అప్లై చేసుకునే విధానాన్ని ఈ దిగువున వివరంగా అందజేశాం. అభ్యర్థులు పరిశీలించవచ్చు.
- ముందుగా అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు www.schooledu.telangana.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో టీఎస్ డీఎస్సీ 2024 రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన లింక్‌ను గుర్తించి క్లిక్ చేయాలి.
- తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో Registration & Fee Payment, Fill Online Application, Print Your Filled In Application Form, Know Your Payment Status అనే ఆప్షన్లు కనిపిస్తాయి.
- అందులో ముందుగా Registration & Fee Payment పై క్లిక్ చేయాలి. ఆపై కనిపించే పేజీలో అడిగిన వివరాలు నమోదు చేసి పేమంట్ పూర్తి చేయాలి.
- తర్వాత మళ్లీ హోంపేజీకి వచ్చి Fill Online Applicationపై క్లిక్ చేయాలి. ఓపెన్ అయ్యే పేజీలో అభ్యర్థులు తమ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
- తర్వాత హోంపేజీలో Print Your Filled In Application Form అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం దగ్గర ఉంచుకోవాలి.
- రిక్రూట్మెంట్ ప్రాసెస్‌కు సంబంధించిన అప్డేట్లు, నోటిఫికేషన్ల కోసం అధికారిక వెబ్సైట్ లేదా మీ రిజిస్టర్డ్ ఈ మెయిల్‌ను చెక్ చేస్తూ ఉండాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.