TS EAMCET 2023 Application form Correction: టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ ప్రక్రియ ప్రారంభం, మార్పులు ఎలా చేసుకోవాలంటే?
TS EAMCET 2023 అప్లికేషన్ కరెక్షన్ విండో ఓపెన్ (TS EAMCET 2023 Application form Correction) అయింది. టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌లో ఎలాంటి మార్పులు చేయవచ్చో? పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
టీఎస్ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ కరెక్షన్ (TS EAMCET 2023 Application form Correction): TS EAMCET 2023 కరెక్షన్ విండోని ఏప్రిల్ 12వ తేదీన అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అప్లికేషన్ ఫార్మ్‌లో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలనుకునే (TS EAMCET 2023 Application form Correction) అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ eamcet.tsche.ac.inని సందర్శించాలి. టీఎస్ ఎంసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 10, 2023తో గడువు ముగిసింది. అయినప్పటికీ అభ్యర్థులు ఆలస్య రుసుము చెల్లించి మే 2 వరకు ఫార్మ్‌ని పూరించవచ్చు. అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫార్మ్‌ని 14 ఏప్రిల్ 2023 వరకు సరిదిద్దుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత అభ్యర్థులకు ఏప్రిల్ 30న హాల్ టికెట్ జారీ చేయబడుతుంది. TS EAMCET 2023 గురించి మరిన్ని వివరాలు ఈ ఆర్టికల్లో చూడండి.
TS EAMCET 2023 అప్లికేషన్ కరెక్షన్ డేట్స్ (TS EAMCET 2023: Application Correction Date)
TS EAMCET అప్లికేషన్ ఫార్మ్‌లో తప్పులను సరిదిద్దుకోవడానికి ముఖ్యమైన తేదీలని ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.ఈవెంట్స్ | తేదీలు |
అప్లికేషన్ దిద్దుబాటు విండో ఓపెన్ | 12 ఏప్రిల్ 2023 |
అప్లికేషన్ దిద్దుబాటు విండో క్టోజ్ చేసే టైం | 14 ఏప్రిల్ 2023 |
హాల్ టికెట్ | 30 ఏప్రిల్ 2023 |
తేదీ పరీక్ష |
|
TS EAMCET 2023 అప్లికేషన్ కరెక్షన్ కోసం స్టెప్స్ (TS EAMCET 2023: Steps for Application Correction)
TS EAMCET 2023 కోసం అప్లికేషన్ ఫార్మ్‌లో ఎలా కరెక్షన్స్ చేయాలో ఈ దిగువున స్టెప్స్ ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు పరిశీలించవచ్చుస్టెప్ 1: అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ను eamcet.tsche.ac.in సందర్శించాలి
స్టెప్ 2: హోంపేజీలో అప్లికేషన్ కరెక్షన్ లింక్‌ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి
స్టెప్ 3: అప్లికేషన్ ఫార్మ్ ఓపెన్ అవ్వడానికి లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 4: తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌లో అవసరమైన మార్పులను చేయాలి
స్టెప్ 5: అనంతరం ఆ మార్పులను సేవ్ చేసి సబ్మిట్ చేయాలి.
స్టెప్ 6: అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి. భవిష్యత్తు అవసరాల రీత్యా అప్లికేషన్ ఫార్మ్ ప్రింట్ అవుట్ ఉపయోగపడుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.