అతి త్వరలో విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023, ముఖ్యమైన తేదీలు ఇక్కడ తెలుసుకోండి
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ( TS EAMCET Application Form 2023 ) అత్యంత త్వరలో విడుదల కాబోతుంది. తెలంగాణ ఎంసెట్ పరీక్ష మే 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరుగుతుంది. విద్యార్థులు అధికారిక వెబ్సైటు లో రిజిస్టర్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ( TS EAMCET Application Form 2023 ) : తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ( TSCHE) తరపున జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యునివర్సిటీ హైదరాబాద్ తెలంగాణ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ను విడుదల చేస్తుంది. తెలంగాణ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ఫిబ్రవరి 2023 చివరి వారంలో విడుదల అవుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మరియు మెడికల్ కోర్సులలో అడ్మిషన్ కోసం ప్రయత్నించే విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ 2023 పరీక్ష వ్రాయాలి. తెలంగాణ ఎంసెట్ 2023 లో అర్హత సాధించిన విద్యార్థులు పైన వివరించిన కోర్సులలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ ను అధికారిక వెబ్సైట్ లో పొందవచ్చు. తెలంగాణ ఎంసెట్ కు రిజిష్టర్ అవ్వడం, దరఖాస్తు ఫీజు చెల్లించడం అప్లికేషన్ పూర్తి చేయడం మొదలైన ప్రక్రియ అంతా అధికారిక వెబ్సైట్ ద్వారా చేయాలి. తెలంగాణ ఎంసెట్ 2023 కు రిజిష్టర్ చేసుకోవడానికి జనరల్ కేటగిరీ విద్యార్థులు 800/- రూపాయలు మరియు ఎస్సీ/ ఎస్టీ విద్యార్థులు 400/- రూపాయలు చెల్లించాలి.
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 అంచనా తేదీ
తెలంగాణ ఎంసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ విడుదల కు సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ క్రింది పట్టిక లో తెలుసుకోవచ్చు.
కార్యక్రమం | తేదీలు |
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 | ఫిబ్రవరి 2023 చివరి వారంలో విడుదల అవుతుందని అంచనా |
తెలంగాణ ఎంసెట్ పరీక్ష తేదీ 2023 | 7 నుండి 11 మే 2023 వరకు |
తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ను ఎలా పూర్తి చేయాలి?
విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023 ను పూర్తి చేయడానికి ఈ క్రింద ఉన్న స్టెప్స్ ను అనుసరించాలి.
- విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ అధికారిక వెబ్సైట్ eamcet.tsche.ac.in ను ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీ లో ఉన్న ' తెలంగాణ ఎంసెట్ అప్లికేషన్ ఫార్మ్ 2023' అని ఉన్న లింక్ మీద క్లిక్ చేయాలి.
- విద్యార్థి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వివరాలు నమోదు చేయాలి.
- తెలంగాణ ఎంసెట్ రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.
- చెల్లింపు పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు వారి అనుకూలత ను బట్టి కావాల్సిన సమయంలో అప్లికేషన్ పూర్తి చేయాలి.
- పూర్తి చేసిన అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
లేటెస్ట్ Education News కోసం, కాలేజీ దేఖోను ఫాలో అవ్వండి.