TS EAMCET Counseling 2023: జూన్‌లోనే తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్
TS EAMCET కౌన్సెలింగ్ 2023 (TS EAMCET Counseling 2023) TSCHE జూన్ 26న TS EAMCET కౌన్సెలింగ్ 2023ని ప్రారంభిస్తుంది. కౌన్సెలింగ్‌కు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
TS EAMCET కౌన్సెలింగ్ తేదీ 2023 (TS EAMCET Counseling 2023): TSCHE TS EAMCET 2023 తేదీ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ అయింది. జూన్‌లో తెలంగాణ ఎంసెట్ 2023 కౌన్సెలింగ్ (TS EAMCET Counseling 2023) ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన తేదీలను అధికారులు విడుదల చేశారు. జూలైలోగా తరగతులను ప్రారంభించేలా అధికార యంత్రాంగం నిర్ధారిస్తుంది. TSCHE కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్‌లు, సీట్ల కేటాయింపు ఉంటాయి. TS EAMCET 2023 మంచి ర్యాంకు సాధించిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌కు పిలవడం జరుగుతుంది. అనంతరం అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఇది కూడా చదవండి: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు 2023 విడుదల, డైరక్ట్ లింక్
TS EAMCET కౌన్సెలింగ్ తేదీ 2023 (TS EAMCET Counseling Date 2023
TS EAMCET కౌన్సెలింగ్ 2023కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు ఈ దిగువున పరిశీలించవచ్చు.ఈవెంట్ | అంచనా తేదీలు |
అధికారిక నోటిఫికేషన్ విడుదల | మే 27, 2023 |
రిజిస్ట్రేషన్ ప్రారంభం | జూన్ 26, 2023 |
టీఎస్ ఎంసెట్ 2023 రిజిస్ట్రేషన్ చివరి తేదీ | జూలై 06, 2023 |
TS EAMCET 2023 డాక్యుమెంట్ వెరిఫికేషన్ | జూన్ 28 నుంచి జూలై 06, 2023 |
TS EAMCET 2023 వెబ్ ఆప్షన్లు | జూన్ 28, 2023 జూలై 08 |
సీటు కేటాయింపు | జూలై 12, 2023 |
TS EAMCET సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ | జూలై 21, 2023 |
ఈ సంవత్సరం TSCHE ప్రత్యేక కేటగిరీలు మినహా ఆన్‌లైన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను నిర్వహిస్తుంది. వివరణాత్మక కౌన్సెలింగ్ మార్గదర్శకాలు tseamcet.nic.inలో జారీ చేయబడతాయి. అభ్యర్థులు తప్పనిసరిగా ర్యాంక్ కార్డ్, TS EAMCET హాల్ టికెట్, స్టడీ సర్టిఫఇకెట్, ఇంటర్ మార్క్ షీట్, పదో తరగతి మార్క్ షీట్, కేటగిరి సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం వంటి అన్ని అవసరమైన పత్రాలను తప్పనిసరిగా ఉంచుకోవాలి.
కన్వీనర్ కోటా కింద 70 శాతం సీట్లను భర్తీ చేయడానికి TS EAMCET 2023 కౌన్సెలింగ్ నిర్వహించబడుతుంది. మరోవైపు, 30% సీట్లు కేటగిరీ B, మేనేజ్‌మెంట్ కోటా కిందకు వస్తాయి. కేటగిరీ B అడ్మిషన్లు రౌండ్ 2 TS EAMCET కౌన్సెలింగ్ 2023 తర్వాత మాత్రమే ప్రారంభమవుతాయి.
లేటెస్ట్ Education News కోసం కాలేజీ దేఖోను సందర్శిస్తూ ఉండండి. మీరు news@collegedekho.comలో కూడా మాకు వ్రాయవచ్చు.