TS EAMCET Expected Rank 2023: TS EAMCET 2023లో మీ ర్యాంకు ఎంతో ఇలా తెలుసుకోండి
అధికారిక TS EAMCET ఇంజనీరింగ్ ఆన్సర్ కీ 2023 ఇప్పటికే వెలువడింది. విద్యార్థులు ఇప్పుడు ఎంట్రన్స్ పరీక్షలో స్కోర్ చేసిన మార్కులు ఆధారంగా తమకు ఎంత ర్యాంకు వస్తుందో (TS EAMCET Expected Rank 2023) అంచనా వేసుకోవచ్చు.
TS EAMCET ఆశించిన ర్యాంక్ 2023 (TS EAMCET Expected Rank 2023): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 10 నుంచి 14, 2023 వరకు TS EAMCET 2023 పరీక్షలను నిర్వహించింది. TS EAMCET అధికారిక ఆన్సర్ కీ ఇప్పుడు విడుదలైంది. ఈ ఆన్సర్ కీ ద్వారా విద్యార్థులు తమకు ఎన్ని మార్కులు వస్తాయో అంచనా వేసుకోవచ్చు. TS EAMCET 2023 పరీక్షలో స్కోర్ చేసిన మార్కులు ఆధారంగా వారికి ఏ ర్యాంకు (TS EAMCET Expected Rank 2023) రాబోతుందో అంచనా వేసుకోవచ్చు. మునుపటి సంవత్సరాల కటాఫ్, ర్యాంక్ డేటా ఆధారంగా ఈ కింద పేర్కొన్న TS EAMCET అంచనా ర్యాంక్ 2023 విశ్లేషణ రూపొందించడం జరిగిందని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. 2023 సంవత్సరానికి అధికారిక ర్యాంకులు మారవచ్చు కాబట్టి విద్యార్థులు ఈ దిగువ సమాచారాన్ని ప్రాథమిక సూచనగా పరిగణించాలి.
TS EAMCET ఆశించిన ర్యాంక్ 2023 (TS EAMCET Expected Rank 2023)
ఈ కింది టేబుల్లో పేర్కొన్న డేటా అధికారిక డేటా కాదు. ఇది మునుపటి సంవత్సరాల విశ్లేషణ/కటాఫ్ ట్రెండ్‌ల ఆధారంగా తయారు చేయబడింది -TS EAMCET 2023 మార్కులు పరిధి | TS EAMCET 2023 ర్యాంక్ పరిధి |
160 -155 | 1 - 50 |
154 - 150 | 51 - 200 |
149 - 140 | 201 - 500 |
139 - 130 | 501 - 1000 |
129 - 120 | 1001 - 2000 |
119 - 110 | 2001 - 4000 |
109 - 100 | 4001 - 6000 |
99 - 90 | 6001 - 10000 |
89 - 80 | 10001 - 15000 |
79 - 70 | 15001 - 25000 |
69 - 60 | 25001 - 40000 |
59 - 50 | 40001 - 50000 |
49 - 40 | 50001 - 80000 |
40 క్రింద | 80000 పైన |
ఇది కూడా చదవండి|
అయితే జనరల్ విద్యార్థులకు అర్హత మార్కు 40 మార్కులు , ST/SC అభ్యర్థులకు కనీస అర్హత మార్కులు లేదు. మెరుగైన ర్యాంక్ సాధించాలంటే ఎక్కువ స్కోర్ చేయడం ఎల్లప్పుడూ మంచిది. హాజరైన విద్యార్థుల సంఖ్య, ప్రశ్నపత్రం క్లిష్టత స్థాయి వంటి అనేక అంశాల ద్వారా మార్క్ vs ర్యాంక్ ప్రభావితమవుతుంది.
ఎంట్రన్స్ పరీక్షలు, అడ్మిషన్‌కి సంబంధించిన మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో Education News ని చూస్తూ ఉండండి. మీరు మా ఈ-మెయిల్ ID ద్వారా కూడా news@collegedekho.com మమ్మల్ని సంప్రదించవచ్చు.