TS ECET Results 2023: TS ECET ఫలితాలు విడుదల, ఇక్కడ ర్యాంకు కార్డు డౌన్లోడ్ చేసుకోండి
TS ECET ఫలితాలు 2023 (TS ECET Results 2023) జూన్ 13న విడుదలయ్యాయి. ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను సిద్ధంగా ఉంచుకోవాలి.
టీఎస్ ఈసెట్ ఫలితాలు 2023 (TS ECET Results 2023): తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ పరీక్ష ఫలితాలు 2023 విడుదలయ్యాయి. మే 20, 2023న TS ECET 2023 పరీక్షకు హాజరై, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ecet.tsche.ac.inని సందర్శించి తమ ర్యాంక్ కార్డ్‌లను చెక్ చేయవచ్చు. ఫలితాలను చెక్ చేయడానికి అభ్యర్థులు అధికారిక పోర్టల్‌లో వారి లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఫలితంలో అభ్యర్థి పేరు, సబ్జెక్ట్ వారీగా మార్కులు , హాల్ టికెట్ నెంబర్, కేటగిరి, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్, బ్రాంచ్ ర్యాంక్, మొత్తం మార్కులు ఉంటాయి.
ఇది కూడా చదవండి | టీఎస్ ఈసెట్ ఆన్సర్ కీ 2023
TS ECET ఫలితాలు 2023: తేదీ, సమయం (TS ECET Results 2023: Date, Time)
TS ECET ఫలితం 2023 కోసం తేదీ, టైమ్ ఈ దిగువున అందజేయడం జరిగింది.
TS ECET ఫలితాలు 2023 తేదీ | జూన్ 13, 2023 |
TS ECET ఫలితాలు 2023 సమయం | 3:30 PM |
అధికారిక TS ECET ఫలితాలను తనిఖీ చేయడానికి వెబ్సైట్ 2023 | ecet.tsche.ac.in |
TS ECET ఫలితాలు 2023: డౌన్లోడ్ చేయడానికి స్టెప్స్ (TS ECET Results 2023: Steps to Download)
TS ECET ఫలితం 2023ని చెక్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి అభ్యర్థులు ఈ దిగువ పేర్కొన్న స్టెప్స్ ని అనుసరించవచ్చు:
స్టెప్ 1: TS ECET అధికారిక వెబ్సైట్ ecet.tsche.ac.inకి వెళ్లండి.
స్టెప్ 2: హోంపేజీలో 'TS ECET ఫలితం లింక్' కోసం శోధించి, దానిపై క్లిక్ చేయండి. లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది.
స్టెప్ 3: లాగిన్ పేజీలో మీ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి, 'SUBMIT'పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: తర్వాత 'ఫలితాలను వీక్షించండి'పై క్లిక్ చేయండి. TS ECET ఫలితం 2023 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం TS ECET ఫలితం 2023ని సేవ్ చేయడానికి 'డౌన్లోడ్'పై క్లిక్ చేయండి.
ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించిన మరిన్ని Education News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీరు మా ఇ-మెయిల్ ID news@collegedekho.com వద్ద కూడా మాకు వ్రాయవచ్చు.