TS ICET 2023 Mock Test Link Activated: TS ICET 2023 మాక్ టెస్ట్ ప్రాక్టీస్ లింక్ కోసం ఇక్కడ చూడండి
TS ICET 2023 పరీక్ష మే 26, 27 తేదీలలో నిర్వహించబడుతుంది. TS ICET పరీక్షకు హాజరు కావాలనుకునే వారు మాక్ టెస్ట్ (TS ICET 2023 Mock Test Link Activated) ప్రాక్టీస్ చేయడానికి ఈ కాలేజ్‌దేఖో పేజీలో అందించిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయవచ్చు.
టీఎస్ ఐసెట్ 2023 మాక్ టెస్ట్ లింక్ యాక్టివేటడ్ (TS ICET 2023 Mock Test Link Activated): తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (TSCHE) ద్వారా MBA, MCA కోసం TS ICET 2023 పరీక్ష మే 26, 27 తేదీల్లో జరగనుంది. మాక్ టెస్ట్ లింక్‌ను (TS ICET 2023 Mock Test Link Activated) అధికారులు వారి అధికారిక వెబ్‌సైట్‌లో cet.tsche.ac.in యాక్టివేట్ చేశారు. TS ICET పరీక్షకు హాజరు కావాలనుకునే వారు ఈ కాలేజ్‌దేఖో పేజీలో అందించిన డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మాక్‌టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
ICET మాక్ టెస్ట్‌ను ప్రాక్టీస్ చేయడం వల్ల అభ్యర్థులకు పరీక్ష విధానంపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. మాక్ టెస్ట్ తీసుకోవడం వల్ల అభ్యర్థులు పరీక్షా రోజుకు సంబంధించిన పేపర్ నమూనా, ప్రశ్న రకాలు, మార్కింగ్ సిస్టమ్త, ఇతర ముఖ్యమైన వివరాలను అర్థం చేసుకోగలుగుతారు. దరఖాస్తుదారులు TS ICET మాక్ టెస్ట్‌లో పాల్గొనడం ద్వారా అసలు పరీక్ష స్పష్టమైన దృక్పథాన్ని అర్థం చేసుకోగలుగుతారు.
TS ICET 2023 మాక్ టెస్ట్: డైరెక్ట్ లింక్ (TS ICET 2023 Mock Test: Direct Link)
TS ICET 2023 మాక్ టెస్ట్ ఇవ్వడానికి డైరెక్ట్ లింక్ ఈ దిగువున ఇవ్వబడింది..డైరెక్ట్ లింక్ TS ICET 2023 మాక్ టెస్ట్ ఇవ్వడానికి: Click Here |
TS ICET 2023 మాక్ టెస్ట్: ముఖ్యమైన సూచనలు (TS ICET 2023 Mock Test: Important Instructions)
TS ICET 2023 మాక్ టెస్ట్ కోసం అభ్యర్థి తప్పనిసరిగా తెలుసుకోవలసిన కొన్ని సూచనలు ఈ కింది ఇవ్వడం జరిగింది.- TS ICET మాక్ టెస్ట్ 200 ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మొత్తం 2.5 గంటల (150 నిమిషాలు) వ్యవధిని కలిగి ఉంటుంది.
- మాక్ టెస్ట్ సమయంలో మిగిలిన సమయం టాప్ స్క్రీన్ కుడి మూలలో ప్రదర్శించబడుతుంది.
- TS ICET మాక్ టెస్ట్ నిర్ణీత సమయం ముగిసినప్పుడు స్వయంచాలకంగా ముగుస్తుంది.
- మాక్ టెస్ట్‌లోని ప్రశ్నలు ఇంగ్లీషు, తెలుగు అనే రెండు భాషల్లో అందుబాటులో ఉంటాయి.
- TS ICET మాక్ టెస్ట్‌లో నెగెటివ్ మార్కింగ్‌కి సంబంధించి ఎటువంటి నిబంధన ఉండదు.
మరిన్ని విషయాల కోసం కాలేజ్ దేఖో కోసం చూస్తూ ఉండండి Education News ఎంట్రన్స్ పరీక్షలు మరియు అడ్మిషన్ కి సంబంధించినది. మీరు మా ఇ-మెయిల్ ID వద్ద కూడా మాకు వ్రాయవచ్చు news@collegedekho.com.