TS Inter Results 2023 Release Date: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపే విడుదల
తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్ ఫలితాలు 2023 TS Inter Results 2023 Release Date) తేదీని ప్రకటించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు రేపు (మే 09) ఉదయం 11 గంటలకు విడుదలవుతాయి.
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల తేదీ (TS Inter Results 2023 Release Date): తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TS ఇంటర్ ఫలితాలు 2023 తేదీని ప్రకటించింది. TSBIE ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు మే 9, 2023న ప్రకటించబడతాయి. మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు హాజరైన అభ్యర్థులు TSBIE అధికారిక సైట్లో తమ ఫలితాలను చూసుకోవచ్చు. ఫలితాల లింక్‌లు అభ్యర్థులకు tsbie.cgg.gov.in, results.cgg.gov.in, examresults.ts.nic.inలో అందుబాటులో ఉంటాయి. TS ఇంటర్ ఫలితాలు అధికారిక వెబ్సైట్లలో కాకుండా మొబైల్ యాప్‌లో అందుబాటులో ఉంటాయి. మొబైల్ యాప్ ‘టి యాప్ ఫోలియో’లో కూడా ఫలితం అందుబాటులో ఉంటుంది.
బోర్డు నిర్వహించే విలేకరుల సమావేశంలో TSBIE ఫలితాలను ప్రకటిస్తుంది. ఉత్తీర్ణత శాతం, టాపర్స్ పేరు, ఇతర వివరాలను కూడా రేపు ఉదయం 11 గంటలకు విలేకరుల సమావేశంలో ఫలితాలతో పాటు ప్రకటించడం జరుగుతుంది. కాగా తెలంగాణ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4, 2023 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాలలో జరిగాయి. రాష్ట్రంలో బోర్డు పరీక్షలు ఒకే షిఫ్టులో జరిగాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలను నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది టీఎస్ ఇంటర్ పరీక్షకు దాదాపు 9 లక్షల మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
టీఎస్ ఇంటర్ ఫలితాలను 2023 చెక్ చేసుకునేదెలా? (How to check TS Inter Results?)
తెలంగాణ ఇంటర్ ఫలితాలను 2023 విడుదలైన తర్వాత అభ్యర్థులు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోవాలి. రిజల్ట్స్ చెక్ చేసుకునే విధానం ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- అభ్యర్థులు tsbie.cgg.gov.in, results.cgg.gov.in లేదా examresults.ts.nic.inకి వెళ్లాలి.
- ఇంటర్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఫలితాల లింక్‌ని గుర్తించాలి
- తర్వాత ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి
- తర్వాత మీ ఇంటర్ ఫలితాలు కనిపిస్తాయి.
- ఇంటర్ పరీక్షా ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్‌ను దగ్గరే ఉంచుకోవాలి. ఇంటర్ స్కోర్ కార్డును ప్రింట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.