TS LAWCET 2023 Correction Window: టీఎస్ లాసెట్ 2023 అప్లికేషన్ కరెక్షన్ ఎలా చేసుకోవాలంటే?
TS LAWCET 2023 దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. అప్లికేషన్‌లో జరిగిన పొరపాట్లను (TS LAWCET 2023 Correction Window) సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ దిద్దుబాటు ప్రక్రియ మే 04, 2023న ప్రారంభమై, మే 10, 2023న ముగుస్తుంది.
టీఎస్ లాసెట్ 2023 దిద్దుబాటు ప్రక్రియ (TS LAWCET 2023 Correction Window): TS LAWCET 2023కి దరఖాస్తు ప్రక్రియ రేపటితో ముగుస్తుంది. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు ఏప్రిల్ 06, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే TS LAWCET 2023కి దరఖాస్తు చేసుకునే క్రమంలో ఏమైనా తప్పులు జరిగితే అభ్యర్థులు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. TS LAWCET 2023 దరఖాస్తు దిద్దుబాటు ప్రక్రియ (TS LAWCET 2023 Correction Window) 4 మే 2023న ప్రారంభించబడుతుంది. దరఖాస్తు ఫార్మ్ దిద్దుబాటు ఆన్‌లైన్ మోడ్ ద్వారా ప్రారంభించబడుతుంది. అభ్యర్థులు మే 10, 2023 వరకు అభ్యర్థులు అప్లికేషన్‌లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవచ్చు. TS LAWCET 2023 పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాల కోసం TS LAWCET 2023ని నిర్వహించడం జరుగుతుంది.
TS LAWCET 2023 ముఖ్య వివరాలు (TS LAWCET 2023 Key Details)
- TS LAWCET 2023 అప్లికేషన్ ఫార్మ్ మార్చ్ 04, 2023న విడుదలైంది.
- అభ్యర్థులు లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్‌ని ఆన్‌లైన్ మోడ్‌లోనే పూరించాలి.
- అభ్యర్థులు తమ విద్యా సంబధిత వివరాలను దరఖాస్తులో పూరించాలి. దరఖాస్తుదారులు అవసరమైన డాక్యుమెంట్లను, ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
- అధికారులకు ఎటువంటి అప్లికేషన్ హార్డ్ కాపీలని పంపించాల్సిన అవసరం లేదు.
- భవిష్యత్తు సూచన కోసం వారు పూరించిన దరఖాస్తు ఫార్మ్ ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.
TS LAWCET 2023 అప్లికేషన్ కరెక్షన్ ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2023 Application Correction Important Dates)
TS LAWCET 2023 అప్లికేషన్ కరెక్షన్‌కు సంబంధించిన ముఖ్యమైన తేదీలను ఈ దిగువున టేబుల్లో ఇవ్వడం జరిగింది.అప్లికేషన్ కరెక్షన్ | మే 04 నుంచి మే 10 వరకు 2023 |
అడ్మిట్ కార్డు విడుదల | మే 16, 2023 |
టీఎస్ లాసెట్ 2023 పరీక్ష | మే 25, 2023 |
TS LAWCET 2023 దరఖాస్తు దిద్దుబాటు తేదీలు (TS LAWCET 2023 Application Correction Dates)
TS LAWCET 2023 దరఖాస్తు ఫార్మ్ కరెక్షన్ విధానం గురించి ఈ దిగువున తెలుసుకోవచ్చు. ఫార్మ్‌లో దిద్దుబాట్లు ఎలా చేయాలో కింద స్టెప్లు అందించబడ్డాయి.- స్టెప్ 1: మొదట అభ్యర్థులు TS LAWCET 2023 అధికారిక వెబ్‌సైట్‌ను lawcet.tsche.ac.in సందర్శించాలి
- స్టెప్ 2: హోం పేజీలో ఆన్‌లైన్ దరఖాస్తు ఫార్మ్ మార్పు కోసం అభ్యర్థన లింక్‌ను గుర్తించాలి
- స్టెప్ 3: ఆ లింక్‌పై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: తర్వాత ఓపెన్ అయ్యే పేజీలో రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్‌ను నమోదు చేయాలి
- స్టెప్ 5: అప్లికేషన్‌లో అన్ని సరిగ్గా నింపిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. దరఖాస్తు ఫార్మ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- స్టెప్ 6: అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి ‘ఫార్మ్‌ని సవరించు’పై క్లిక్ చేయాలి
- స్టెప్ 7: 'సబ్మిట్' అనే ఆప్షన్‌ని ఎంచుకోవాలి
- స్టెప్ 8: భవిష్యత్ అవసరం కోసం ప్రింటవుట్ తీసుకుని దగ్గర పెట్టుకోవాలి.