TS LAWCET 2023 Application Last Date: విద్యార్థులకు అలర్ట్.. లాసెట్ 2023కి దరఖాస్తు చేసుకోవడానికి రేపే లాస్ట్‌డేట్
తెలంగాణ రాష్ట్రంలో లాసెట్ 2023కు దరఖాస్తు చేసుకోవడానికి (TS LAWCET 2023 Application Last Date) రేపే (ఏప్రిల్ 06, 2023) లాస్ట్ డేట్. ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా అభ్యర్థులు గురువారంలోపు అప్లై చేసుకోవచ్చు. TS LAWCET 2023కి సంబంధించి పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
టీఎస్ లాసెట్ 2023 అప్లికేషన్ లాస్ట్ డేట్ (TS LAWCET 2023 Application Last Date): తెలంగాణలో లాసెట్ 2023 అప్లికేషన్ ఫార్మ్ సబ్మిట్ చేయడానికి రేపే (ఏప్రిల్ 06, 2023) చివరి తేదీ. అభ్యర్థులు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా రేపటిలోగా (TS LAWCET 2023 Application Last Date) దరఖాస్తు చేసుకోవచ్చు. TS LAWCET 2023 మూడేళ్లు, ఐదేళ్ల LLB కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించబడే రాష్ట్రస్థాయి పరీక్ష.
TS LAWCET 2023ని తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ తరపున ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నిర్వహిస్తుంది. తెలంగాణ లాసెట్ పరీక్ష 25 మే 2023న నిర్వహించబడుతుంది. లాసెట్‌లో మంచి ర్యాంకులు సాధించిన అభ్యర్థులు రాష్ట్రంలోని అనేక ప్రభుత్వ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందవచ్చు. ఈ ఆర్టికల్లో TS LAWCET 2023 ప్రవేశ పరీక్షకు సంబంధించిన పరీక్ష తేదీలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, అడ్మిషన్, అడ్మిట్ కార్డ్, కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైన అన్ని వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.
TS LAWCET 2023 ముఖ్యాంశాలు (TS LAWCET 2023 Highlights)
TS LAWCET 2023కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఈ దిగువన టేబుల్లో ఇవ్వడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఇక్కడ చూడొచ్చు.పరీక్ష నిర్వహణ సంస్థ | ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ |
పరీక్ష పేరు | తెలంగాణ స్టేట్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ |
ఎగ్జామ్ లెవల్ | రాష్ట్రస్థాయి |
కోర్సులు | మూడేళ్లు, ఐదేళ్ల లాకోర్సు |
అప్లికేషన్ విధానం | ఆన్‌లైన్ |
కేటగిరి | లా ఎంట్రన్స్ ఎగ్జామ్ |
TS LWACET 2023 ముఖ్యమైన తేదీలు (TS LAWCET 2023 Exam Dates)
తెలంగాణ రాష్ట్రంలో లా కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా లాసెట్ 2023 రాయాల్సి ఉంటుంది. TS LAWCET 2023కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ రిలీజ్ | ఫిబ్రవరి 28, 2023 |
అప్లికేషన్ ఫార్మ్ రిలీజ్ డేట్ | మార్చి 02, 2023 |
ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 06, 2023 |
రూ.500ల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 01, 2023 |
రూ.1000ల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | ఏప్రిల్ 19, 2023 |
రూ.2000ల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | ఏప్రిల్ 26, 2023 |
రూ.4000ల లేట్ ఫీజుతో దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్‌డేట్ | మే 03, 2023 |
అప్లికేషన్ కరెక్షన్ | మే 04 నుంచి మే 10, 2023 |
లాసెట్ 2023 కోసం అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరకాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన పూర్తి వివరాలను ఇచ్చి, విద్యా సంబంధిత పత్రాలను అప్‌లోడ్ చేయాలి. అభ్యర్థులు జనరల్, బీసీ అభ్యర్థులు రూ.900లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.