TS Multipurpose Health Assistant Jobs 2023: నిరుద్యోగులకు అలర్ట్, తెలంగాణలో 1520 ఉద్యోగాలు, అర్హతలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం నుంచి 1500లకు పైగా మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి (TS Multipurpose Health Assistant Jobs 2023) నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ జాబ్స్ 2023 (TS Multipurpose Health Assistant Jobs 2023): తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. 1500లకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ స్టేట్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (MHSRB) రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం బుధవారం 1,520 మల్టీ పర్సస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళ) ఉద్యోగాల భర్తీకి (TS Multipurpose Health Assistant Jobs 2023) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ ఉద్యోగాలకు సెలక్ట్ అయి జాయిన్ అయిన వారికి నెలకు రూ. 31,040 నుంచి రూ. 92,050 వరకు జీతం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను MPHA (మహిళలు) అభ్యర్థులు 100 పాయింట్ల ఆధారంగా ఎంపిక చేయబడతారు. అందులో 80 పాయింట్లు రాత పరీక్ష, మిగిలిన 20 పాయింట్లు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆస్పత్రులు/సంస్థలు/ ప్రోగ్రామ్‌లలో సేవలకు అందించబడతాయి. కాగా ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులు ఆగస్టు 25 ఉదయం 10.30 నుంచి ప్రారంభించబడతాయి. (https://mhsrb.telangana.gov.in) దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19.
టీఎస్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ వివరాలు (TS multi purpose health assistant Recruitment Details)
టీఎస్ మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ అందజేయడం జరిగింది.రీక్రూట్మెంట్ పేరు | టీఎస్ ఎంపీహెచ్ఏ రిక్రూట్మెంట్ 2023 |
టైటిల్ | TS MPHA నోటిఫికేషన్ 2023 |
సబ్జెక్ట్ | TS MPHA రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2023 |
కేటగిరి | రిక్రూట్మెంట్ |
వెబ్సైట్ | https://mhsrb.telangana.gov.in/ |
రిజిస్ట్రేషన్ | 25-08-2023 to 19-09-2023 |
జోన్ల వారీగా పోస్టులు ( Zone wise posts)
జోన్ల వారీగా పోస్టుల వివరాలు ఈ దిగువున పట్టికలో అందజేశాం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పరిశీలించవచ్చు.జోన్ 1 కాళేశ్వరం | 169 |
జోన్ 2 బాసర | 225 |
జోన్ 3 రాజన్న | 263 |
జోన్ 4 భద్రాద్రి | 237 |
జోన్ 5 యాదాద్రి | 241 |
జోన్ 6 చార్మినార్ | 189 |
జోన్ 7 జోగులాంబ | 196 |
టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలు 2023 అర్హత వివరాలు (TS Multipurpose Health Assistant Jobs 2023)
- టీఎస్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.
- ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సులో పాసై ఉండాలి. అభ్యర్థులు మల్టీ పర్సస్ హెల్త్ వర్కర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేయాలి. మిడ్వైఫరీ కౌన్సిల్లో పేరు రిజిస్టర్ చేసుకోవాలి.
- అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ కేటగిరి ప్రకారం అభ్యర్థుల వయస్సులో మినహాయింపు ఉంటుంది. రాత పరీక్ష, పని అనుభవం ద్వారా అభ్యర్థులను సెలక్ట్ చేయడం జరుగుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్, ఆర్టికల్స్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.