TS Police 2023 Exam Day Instructions: ఏప్రిల్ 2న కానిస్టేబుల్ రాతపరీక్ష, పరీక్ష రోజున ఈ రూల్స్ పాటించాల్సిందే
డ్రైవర్ ఆపరేటర్ పోస్టు భర్తీ కోసం TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న జరగనుంది. పరీక్ష రోజున అభ్యర్థులు ఎటువంటి నియమ, నిబంధనలు (TS Police 2023 Exam Day Instructions) పాటించాలో ఇక్కడ అందజేశాం.
టీఎస్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రోజు పాటించాల్సిన సూచనలు ( TS Police 2023 Exam Day Instructions): తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల్లో కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రాత పరీక్ష తేదీలను ఇప్పటికే వెల్లడించడం జరిగింది. రవాణా కానిస్టేబుల్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ 30 ఏప్రిల్ 2023న, డ్రైవర్ ఆపరేటర్ పోస్టు భర్తీ కోసం TS పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష 2 ఏప్రిల్ 2023న, SCT PC (మెకానిక్) పోస్టులకు పరీక్ష ఏప్రిల్ 2, 2023 మధ్యాహ్నం నుంచి సాయంత్రం జరగనుంది. PMT/PETలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరు కావాలి. ఈ ఎగ్జామ్ హైదరాబాద్‌లో జరగనుంది. పరీక్ష రోజున అభ్యర్థులు ఎటువంటి నియమాలు, నిబంధనలు (TS Police 2023 Exam Day Instructions) పాటించాలో ఈ ఆర్టికల్లో అందజేయడం జరిగింది.
TSLPRB పరీక్ష షెడ్యూల్ (TSLPRB Exam Schedule)
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఈ దిగువ టేబుల్లో అందజేశాం.పరీక్ష తేదీ | సమయం | పోస్టులు | పరీక్ష వివరాలు | పరీక్ష నిర్వహించే సిటీ |
ఏప్రిల్ 2, 2023 | ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు | SCT PC (డ్రైవర్) డ్రైవర్ ఆపరేటర్ | టెక్నికల్ పేపర్ 3 (మూడు) గంటల వ్యవధి ఆబ్జెక్టివ్ టైప్ – 200 ప్రశ్నలు | హైదరాబాద్ |
ఏప్రిల్ 2, 2023 | మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు | SCT PC (మెకానిక్) | టెక్నికల్ పేపర్* 3 (మూడు) గంటల వ్యవధి ఆబ్జెక్టివ్ టైప్ 200 ప్రశ్నలు | హైదరాబాద్ |
TSLPRB పరీక్ష రోజున పాటించాల్సిన సూచనలు (TSLRB Exam Important Instructions)
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ నిర్వహించే ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఎగ్జామ్ రోజున కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది.- కానిస్టేబుల్ రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు.
- కోవిడ్ కారణంగా అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో ఉండే సమయమంతా మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. ప్రతి అభ్యర్థి వాటర్ బాటిల్, హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోవాలి. సామాజిక దూరం పాటించాలి
- అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లను ఏ4సైజ్ పేపర్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నిర్దేశిత స్థలంలో తప్పనిసరిగా అభ్యర్థి ఫొటోను సరిగ్గా అతికించుకోవాలి.
- అభ్యర్థి ఫోటోగ్రాఫ్, సంతకం స్పష్టంగా ఉంటే మాత్రమే ఈ హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది.
- అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు హాల్ టికెట్‌తోపాటు బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌ను మాత్రమే వెంట తీసుకెళ్లాలి. సెల్‌ఫోన్, టాబ్లెట్, పెన్‌డ్రైవ్, బ్లూటూత్ డివైజ్, వాచ్, కాలుక్యులేటర్, లాగ్‌టేబుల్, వాలెట్, పర్స్, నోట్స్, చార్ట్, రికార్డింగ్ పరికరాలు, ఖాళీపేపర్లను తీసుకెళ్లకూడదు.
- అభ్యర్థులు ఓఎంఆర్ షీట్లపై అనవసర రాతలు రాయకూడదు. గుర్తులు, మతసంబంధ అంశాల్లాంటివి రాస్తే మాల్‌ప్రాక్టీస్‌గా పరగణించడం జరుగుతుంది.
- అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని అసలు పరీక్ష తేదీకి ఒకరోజు ముందుగా వెళ్లి చెక్ చేసుకోవాలి. దాంతో పరీక్షా కేంద్రం గురించి స్పష్టంగా తెలుస్తుంది.