TS పాలీసెట్ 2023: (TS POLYCET Admission 2023) అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు, ప్రక్రియ, ఫీజు వివరాలు
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET Admission 2023) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలంగాణ పాలిటెక్నిక్ కోర్సుల అడ్మిషన్‌కు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. పాలిసెట్‌కు ఉండాల్సిన అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేయడం జరిగింది.
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET Admission 2023): పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ పాలిటెక్నిక్ నోటిఫికేషన్ (TS POLYCET Admission 2023) విడుదలైంది. పదో తరగతి పాసైన విద్యార్థులు, ఈ ఏడాది పరీక్షలు రాయబోతున్న విద్యార్థులు కూడా పాలిసెట్ కోసం (TS POLYCET Admission 2023) అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 16వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఏప్రిల్ 24వ తేదీ లాస్ట్ డేట్. రూ.100 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
తెలంగాణ పాలిసెట్ 2023 దరఖాస్తు ఫీజు (Telangana POLYCET 2023 Application Fee)
TS POLYCET 2023 కోసం జనరల్, బీసీ విద్యార్థులు దరఖాస్తు ఫీజుగా రూ.500 చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఈ ఫీజు రూ.450గా ఉండేది. ఇప్పుడు ఆ ఫీజును రూ.500లకు పెంచారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజుపై రాయితీ ఉంటుంది. వారు రూ.250లు చెల్లిస్తే సరిపోతుంది.తెలంగాణ పాలిసెట్ 2023 ముఖ్యమైన తేదీలు (Important Dates of TS POLYCET 2023 )
తెలంగాణ పాలిసెట్ 2023కు (TS POLYCET 2023 Notification) సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఈ దిగువన ఇవ్వడం జరిగింది.పాలిసెట్ 2023 | ముఖ్యమైన తేదీలు |
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 16.01.2023 |
దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది | 24.04.2023 |
ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ | 25.04.2023 |
పాలిసెట్ పరీక్ష తేదీ | 17.05.2023 |
తెలంగాణ పాలిసెట్ 2023 కోసం అర్హతలు (TS POLYCET 2023 Eligibility Criteria)
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)కు దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులకు కొన్ని అర్హతలు ఉండాలి.- భారతీయ పౌరులై ఉండాలి
- తెలంగాణ నివాసై ఉండాలి.
- రాష్ట్ర సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు నిర్వహించిన పదో తరగతిలో పాసై ఉండాలి.
తెలంగాణ పాలిసెట్ 2023కి దరఖాస్తు చేసుకునే విధానం (TS POLYCET 2023 Application Process)
తెలంగాణ పాలిసెట్ 2023 (TS POLYCET 2023)పై ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఈ దిగువున వివరంగా ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి అభ్యర్థులు కింద ఇవ్వబడిన దశలను అనుసరించాలి.- టీఎస్ పాలిసెట్‌కు సంబంధించిన www.tspolycet.nic.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- వెబ్‌సైట్‌లో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- ఆన్‌లైన్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- దరఖాస్తు ఓపెన్ అవుతుంది
- దరఖాస్తులో 10వ తరగతి హాల్ టికెట్ నెంబర్, ఉత్తీర్ణత సాధించిన సంవత్సరం, పుట్టిన తేదీ, విద్యార్థి పర్మినెంట్ అడ్రస్, తండ్రి పేరు, ఎగ్జామ్ సెంటర్, రిజర్వేషన్ సమాచారం, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయాలి.
- ఫోటో, విద్యార్థి సంతకం అప్‌లోడ్ చేయాలి.
- తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించిన వెంటనే అడ్మిట్ కార్డ్ జరేట్ అవుతుంది.