TS SET 2023 పరీక్ష వాయిదా, కొత్తగా ప్రకటించిన పరీక్ష తేదీలు ఎప్పుడంటే.
TS SET 2023 పరీక్ష షెడ్యూల్ ప్రకారం మార్చి 13వ తేదీన జరగనుంది. ఈ పరీక్షకు హాజరు అవుతున్న విద్యార్థులు కొత్తగా ప్రకటించిన తేదీలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. TS SET 2023 హాల్ టికెట్ మార్చి 10న విడుదల అవుతుంది.
TS SET 2023 పరీక్ష తేదీ : తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(TS SET 2023) ను వాయిదా వేస్తున్నట్లు ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. MLC ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎన్నికల కారణంగా మార్చి 13న జరగాల్సిన TS SET 2023 పరీక్ష తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా వేయబడింది. కొత్త పరీక్ష తేదీలు ని అధికారులు ఇంకా ప్రకటించలేదు. అయితే, మార్చి 14 & 15 తేదీల్లో జరగాల్సిన పరీక్షలు అదే రోజున నిర్వహించబడతాయి. మార్చి 13వ తేదీ జరగునన్న పరీక్ష మాత్రం వాయిదా పడింది, ఈ పరీక్ష జరిగే తేదీలను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకోవచ్చు.
TS SET 2023 పరీక్ష మార్చి 13వ తేదీ : రివైజ్డ్ షెడ్యూల్
ఉస్మానియా యూనివర్సిటీ మెంబర్ సెక్రటరీ ద్వారా telanganaset.orgలో విడుదల చేసిన లేటెస్ట్ నోటిఫికేషన్ ప్రకారం,TS SET 2023 మార్చి 13వ తేదీ జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. TS SET 2023 హాల్ టికెట్ మార్చి 10 నుంచి అందుబాటులోకి వస్తుంది. TS SET 2023 పరీక్ష తేదీల గురించిన ముఖ్యమైన సమాచారం క్రింది పట్టికలో తెలుసుకోవచ్చు.
ఈవెంట్ | తేదీ |
TS SET 2023 పరీక్ష (పాత షెడ్యూల్) | మార్చి 13, 2023 (వాయిదా వేయబడింది) మార్చి 14 & 15, 2023 |
TS SET 2023 పరీక్ష (కొత్త షెడ్యూల్) | మార్చి 10 లోపు ప్రకటన విడుదల అవుతుంది. మార్చి 14 & 15, 2023 |
TS SET 2023 హాల్ టికెట్ | మార్చి 10 |
TS SET 2023 13వ తేదీ మార్చి పరీక్ష వాయిదా పడినందున, అభ్యర్థులు వెబ్‌సైట్‌లో కొత్త పరీక్షల షెడ్యూల్‌ను గమనించాలి.
తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TS SET 2023) అసిస్టెంట్ ప్రొఫెసర్ & లెక్చరర్ పోస్ట్ కోసం అర్హత మరియు అర్హత కలిగిన అభ్యర్థులను నియమించడానికి నిర్వహించబడుతోంది. పరీక్ష విధానం ప్రకారం, అభ్యర్థులు ప్రతిరోజూ రెండు పేపర్లకు హాజరవుతారు. పేపర్ 1లో 2 మార్కులు చొప్పున 50 ప్రశ్నలు ఉంటాయి, పేపర్ 2లో 2 మార్కులు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు కేటాయించిన మొత్తం సమయం 3 గంటలు.
రిక్రూట్‌మెంట్ పరీక్షలు మరియు ఉద్యోగ నోటిఫికేషన్‌లకు సంబంధించి మరిన్ని Recruitment News కోసం CollegeDekhoని చూస్తూ ఉండండి. మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మా ఇ-మెయిల్ ID news@collegedekho.com ద్వారా కూడా మా నిపుణులను సంప్రదించవచ్చు.