TS SET 2024 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం, ఇలా దరఖాస్తు చేసుకోండి (TS SET Registration 2024)
టీఎస్ సెట్ రిజిస్ట్రేషన్ 2024 (TS SET Registration 2024) ప్రక్రియ ప్రారంభమైంది. రిజిస్ట్రేషన్‌క చేసుకోవడానికి జూలై 2 చివరి తేదీ. అభ్యర్థుల కోసం దరఖాస్తు చేసుకునే విధానాన్ని ఇక్కడ అందించాం.
తెలంగాణ సెట్ రిజిస్ట్రేషన్ 2024 (TS SET Registration 2024) : ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS SET 2024) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. అర్హత ఉన్న అభ్యర్థులు TS SET 2024 దరఖాస్తు ఫార్మ్‌ను జూలై 2 లోపు అధికారిక వెబ్‌సైట్ telanganaset.orgలో దరఖాస్తు చేసుకోవచ్చు. షెడ్యూల్ ప్రకారం TS SET 2024 పరీక్ష ఆగస్ట్ 28 నుంచి 31 వరకు జరుగుతుంది. ఇన్స్టిట్యూట్ జూలై 28, 29 తేదీలలో రెండు రోజుల పాటు అప్లికేషన్ కరెక్షన్ విండోను ఓపెన్ చేస్తుంది. అభ్యర్థులు ఆగస్టు 20న TS SET 2024 అడ్మిట్ కార్డ్‌ని దీని నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ సెట్ 2024 ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?(TS SET 2024: How to Register)
TS SET 2024కి అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన విధంగా అప్లై చేసుకోవచ్చు.స్టెప్ 1: ముందుగా అభ్యర్థులు అధికారిక TS SET వెబ్‌సైట్‌ను online.telanganaset.org సందర్శించాలి.
స్టెప్ 2: హోంపేజీలో 'ఆన్‌లైన్ అప్లికేషన్' లింక్‌ని ఎంచుకోవాలి.
స్టెప్ 3: రిజిస్టర్ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ వివరాలను పూరించాలి. సబ్మిట్ పై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: ఇప్పుడు, నమోదు చేసిన వివరాల ద్వారా లాగిన్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలను పూరించాలి.
స్టెప్ 5: అవసరమైన పత్రాలు, ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 6: ఫీజు చెల్లించి దరఖాస్తును సబ్మిట్ చేయాలి.
స్టెప్ 7. భవిష్యత్తు సూచన కోసం కాపీని సేవ్ చేసుకోవాలి.
TS SET 2024 అర్హత ప్రమాణాలు (TS SET 2024 Eligibility Criteria)
జనరల్ కేటగిరీ అభ్యర్థులు వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలో 55 శాతం లేదా తత్సమాన CGPA స్కోర్ చేసి ఉండాలి. BC, SC, ST, PwD, ట్రాన్స్ జెండర్ కేటగిరికి చెందిన అభ్యర్థులు వారి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలో 50 శాతం మార్కులు లేదా సమానమైన CGPA సాధించి ఉండాలి. ఈ పరీక్షలో హాజరు కావడానికి తక్కువ లేదా ఎక్కువ వయస్సు పరిమితి లేదు.TS SET 2024 దరఖాస్తు ఫీజు (TS SET 2024 Application fees)
తెలంగాణ సెట్ 2024కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సర్వీసు ఛార్జీతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఓసీ కేటగిరి అభ్యర్థులు రూ.2000, బీసీఏ, బీసీబీ, బీసీసీ, BC-D, BC-E, EWS అభ్యర్థులు రూ.1500లు, SC, ST, VH, OH, HI, ట్రాన్స్ జెండర్లు రూ. 1000 లు చెల్లించాల్సి ఉ:టుంది. ఈ ఫీజును అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది.తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా అప్‌డేట్లను పొందండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.