TS SSC పరీక్షలు 2023: బ్లూ ప్రింట్ మరియు మోడల్ పేపర్‌లు(TS SSC Model Papers 2023) త్వరలో విడుదల కానున్నాయి
తెలంగాణ 10వ తరగతి ప్రశ్న పత్రాల విధానం ఈ విద్య సంవత్సరంలో మార్చబడింది, కొత్త విధానాన్ని అర్ధం చేసుకోవడానికి మోడల్ పేపర్లు (TS SSC Model Papers 2023) చాలా అవసరం అవుతాయి. మోడల్ పేపర్ల గురించిన తాజా సమాచారం ఈ ఆర్టికల్ లో అందించడం జరిగింది.
తెలంగాణ 10వ తరగతి మోడల్ పేపర్లు 2023(TS SSC Model Papers 2023): బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ 10వ తరగతి విద్యార్థులకు 2022-23 విద్య సంవత్సరానికి పరీక్ష విధానం లో కొన్ని మార్పులను చేసింది. ఇప్పటి వరకూ విద్యార్థులు 11 పరీక్షలు రాస్తున్నారు. అయితే తెలంగాణ బోర్డు ఈ విద్య సంవత్సరంలో 6 పరీక్షలను మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ప్రశ్న పత్రాలు( TS SSC Model Papers 2023) ఎలా ఉంటాయి అనే సమాచారం ఇప్పటి వరకూ విద్యార్థుల వద్ద లేదు. అసలు ప్రశ్న పత్రాల విధానం ఎలా ఉంటుంది? ప్రశ్నలకు మార్కులు ఎలా విభజిస్తారు అనే విషయం పై కూడా తెలంగాణ బోర్డు నుండి ఎలాంటి సమాచారం లేదు.
ఈ విషయం పై డిసెంబర్ 26వ తేదీన PRTU అధ్యక్షులు ఎం.చెన్నయ్య విద్యాశాఖ ను ప్రశ్నించారు. విద్యార్థుల అవగాహన కోసం 10వ తరగతి మోడల్ పేపర్ ( TS SSC Model Papers 2023) లను మరియు సబ్జెక్ట్ ప్రకారంగా బ్లూప్రింట్ ను విడుదల చేయాలి అని విజ్ఞప్తి చేశారు. గతంలో 11 పేపర్లకు బదులుగా ఈ విద్యా సంవత్సరం లో 6 పేపర్లకే పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు ఎటువంటి ఆందోళన లేకుండా పరీక్షలు వ్రాయాలి అంటే వారికి మోడల్ పేపర్లు ( TS SSC Model Papers 2023) చాలా అవసరం అవుతాయి.
తెలంగాణ 10వ తరగతి పరీక్ష విధానం ( అంచనా)
- ఈ సంవత్సరం విద్యార్థులకు 6 పేపర్లు కు మాత్రమే పరీక్ష జరుగుతుంది.
- ప్రతీ సబ్జెక్టు కు ఒక పేపర్ మాత్రమే ఉంటుంది.
- పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3 గంటల 15 నిమిషాలకు పెంచారు.
- చివరి 30 నిమిషాలలో ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు వ్రాయాల్సి ఉంటుంది.
- ప్రతీ సబ్జెక్టు కు పాస్ మార్కులు 35, హిందీ కు మాత్రం 20 మార్కులు.