తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ (TSPSC Group 1 Mains Exam Pattern 2023) పరీక్ష విధానం ఇదే
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్ పరీక్ష 2023 (TSPSC Group 1 Mains Exam Pattern 2023) కొత్త ప్రశ్నపత్రం విధానాన్ని వెల్లడించింది. ప్రశ్నపత్రంలో ఏ అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్‌లో ఎన్ని మార్కుల ప్రశ్నలు ఉంటాయనే వివరాలు ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్ (TSPSC Group-1 Mains 2023): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్-1 మెయిన్ పరీక్ష 2023 కొత్త ప్రశ్నపత్రం (TSPSC Group 1 Mains Exam Pattern 2023) విధానాన్ని ప్రకటించింది. అభ్యర్థులు శాంపిల్ ప్రశ్న పత్రాన్ని అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ మెయిన్స్‌లో (TSPSC Group 1 Mains Exam Pattern 2023) మొత్తం ఆరు పేపర్లకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఒక్కో పేపరుకు 150 మార్కుల చొప్పున మొత్తంగా 900 మార్కులకు గ్రూప్-1 మెయిన్ పరీక్ష జరుగుతుంది. ఒక్కో పేపరుకు 3 గంటల సమయం కేటాయిస్తారు.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష విధానం (TSPSC Group 1 Mains Exam Pattern 2023)
- పేపర్-1లో జనరల్ ఎస్సైలు (General Essays) ఉంటాయి. పేపర్‌లో మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ఒక్కో సెక్షన్‌లో మూడు ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఒక్క ప్రశ్నకు కచ్చితంగా జవాబు రాయాలి. వెయ్యి పదాలకు తగ్గకుండా ప్రతి ఎస్సై రాయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షన్‌లో 50 మార్కులు చొప్పున మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ 2లో చరిత్ర, సంస్కృతి, జాగ్రఫీ (History, Culture, Geography) సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు జవాబు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. ప్రతి సెక్షన్‌లో మొదటి రెండు కచ్చితంగా సమాధానం రాయాలి. తర్వాత 3,4,5 ప్రశ్నలకు ఛాయిస్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాలకు తగ్గకుండా జవాబు రాయాలి. ఒక్కో సెక్షన్‌కు 50 మార్కులు అంటే ఒక్కో ప్రశ్నకు 10 మార్కుల చొప్పున 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ 3లో భారతీయ సమాజం, రాజ్యాంగం, పరిపాలన (Indian Society, Constitution and Administration) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు జవాబు తప్పనిసరిగా రాయాలి. మొదటి రెండు ప్రశ్నలకు సమాధానాలు కచ్చితంగా రాయాలి. 3,4,5, ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాలకు తగ్గకుండా సమాధానం రాయాలి. ఒక్కో సెక్షన్ 50 మార్కులు చొప్పున 150 మార్కులకు పేపర్ ఉంటుంది.
- పేపర్ 4లో ఎకానమీ, డెవలప్‌మెంట్ (Economy and Development) సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతిసెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు సమాధానం తప్పనిసరిగా రాయాలి. తొలి రెండు ప్రశ్నలకు జవాబులు కచ్చితంగా రాయాల్సి ఉంటుంది. 3,4,5, ప్రశ్నలకు ఇంటర్నల్ ఛాయిస్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాల్లో సమాధానం రాయాలి. మొత్తం 150 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌పై (Science and Technology, on Data Interpretation) ప్రశ్నలు ఉంటాయి. ఇందులో మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు జవాబు రాయాల్సి ఉంటుంది. మొదటి రెండు ప్రశ్నలకు జవాబులకు కచ్చితంగా రాయాలి. 3, 4, 5 ప్రశ్నలకు ఛాయిస్ ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 200 పదాలకు తగ్గకుండా జవాబు రాయాలి. మొత్తం 150 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- పేపర్ 6లో తెలంగాణ ఉద్యమం, రాష్ట్రం ఏర్పాటు (Telangana Movement, State Formation)
అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. మొత్తం మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్‌లో ఐదు ప్రశ్నలకు కచ్చితంగా జవాబు రాయాలి. ప్రతి సెక్షన్‌లో మొదటి రెండు ప్రశ్నలకు ఎటువంటి ఛాయిస్ ఉండదు. వాటికి కచ్చితంగా సమాధానం ఇవ్వాలి. తర్వాత 3, 4, 5 ప్రశ్నల్లో ఛాయిస్ ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 200 పదాలకు తగ్గకుండా సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కోప్రశ్నకు పది మార్కులు చొప్పున మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి. టోటల్‌గా 150 మార్కులకు ఈ పేపర్ ఉంటుంది. - జనరల్ ఇంగ్లీష్ అర్హత పరీక్ష: పదో తరగతి స్థాయిలో ఇంగ్లీష్ నాలెడ్జ్‌పై 150 మార్కులకు ఈ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో ఎస్సై, లెటర్ రైటింగ్, గ్రామర్‌లపై మొత్తం 15 ప్రశ్నలు ఉంటాయి.