TSPSC Group 1 Notification 2024 Expected Date: రేపే తెలంగాణలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్
తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయడానికి కసరత్తు మొదలైంది. ఫిబ్రవరి ఒకటో తేదీన లేదంటే మొదటి వారంలోనే TSPSC గ్రూప్ 1, 2024 నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు (TSPSC Group 1 Notification 2024 Expected Date) కనిపిస్తున్నాయి.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2024 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification 2024 Expected Date): తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మళ్లీ గ్రూప్ 2 నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపత్యంలో ఫిబ్రవరి 1వ తేదీన లేదంటే మొదటి వారంలోనే TSPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification 2024 Expected Date) రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. దీంతోపాటు ఇతర ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా విడుదల కానున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ శాఖల్లో, ప్రభుత్వ విభాగాల్లో ఖాళీల వివరాలను ఇవ్వాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం.
తెలంగాణాలో ఇటీవల అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ (TSPSC Group 1 Notification 2024 Expected Date) విడుదల చేస్తామని పేర్కోవడం జరిగింది. దీంతో రేపే అంటే గురువారం గ్రూప్ 1 రీ నోటిఫికేషన్ జారీ చేసే ఛాన్స్ ఉందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపుగా 600 గ్రూప్ 1 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక వేళ రిలీజ్ అయితే ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఎదురుచూపులు కొంత ఆశ కల్పించినట్టే అవుతుంది.
కాగా 2022లో ఏప్రిల్ నెలలో 502 పోస్టులతో టీఎస్పీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఎగ్జామ్ పేపర్ల లీకేజీ వల్ల చర్చానీయాంశం అయింది. దాంతో ఆ పరీక్షలను రద్దు చేశారు. తిరిగి 2023 జూన్‌లో పరీక్షలు నిర్వహించగా పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని హైకోర్టు పరీక్షను రద్దు చేయాలిన తీర్పునిచ్చింది. దీనిపై అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై వాదనలు జరగలేదు. ఈ కేసు ఇప్పట్లో క్లియర్ అయ్యే ఛాన్స్ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో చాలామంది అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. TSPSC గ్రూప్ 2, 2024 నోటిఫికేషన్ మళ్లీ విడుదలతో వారి ఎదురుచూపులు ఫలించినట్టు అవుతుంది.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేసి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తెలుసుకోండి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.