TSPSC గ్రూప్ 3 ఫలితాలు ఎప్పుడు విడుదలవుతాయి? (TSPSC Group 3 Results 2025)
TSPSC గ్రూప్ 3 (TSPSC Group 3 Results 2025) ఫలితాలు ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ అందించాం. మరిన్ని వివరాలు కోసం ఇక్కడ చూడండి.
TSPSC గ్రూప్ ఫలితాలు 2025 (TSPSC Group 3 Results 2025): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) TSPSC గ్రూప్ 3 పరీక్షను నవంబర్ 17, 18 2024 తేదీల్లో విజయవంతంగా నిర్వహించింది. TSPSC గ్రూప్ 3 పరీక్షకు సుమారు ఐదు లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారంతా ఫలితాల (TSPSC Group 3 Results 2025) విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఫలితాలు అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. అభ్యర్థులు తమ ఫలితాలని చూసుకోవడానికి అధికారిక TSPSC వెబ్‌సైట్‌ను www.tspsc.gov.in సందర్శించాలి. అభ్యర్థులు తమ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. TSPSC గ్రూప్ 3 ఫలితాలు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.
తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? (How to Check Telangana Group 3 Results 2025?)
TSPSC అధికారిక వెబ్‌సైట్ నుంచి తెలంగాణ గ్రూప్ 3 ఫలితాలు 2025ని చెక్ చేయాలనుకునే అభ్యర్థులు కింద ఇవ్వబడిన సాధారణ దశలను అనుసరించవచ్చు.- తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను tspsc.gov.in సందర్శించాలి.
- హోంపేజీలో “కొత్తవి ఏమిటి” అనే విభాగాన్ని గుర్తించాలి.
- ఈ విభాగం కింద “గ్రూప్ 3 సర్వీస్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామినేషన్ అనే టెక్స్ట్‌తో లింక్ కోసం చూడాలి. దానిపై క్లిక్ చేయాలి.
- ఫలితం PDF ఫైల్ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపిస్తుంది.
- అభ్యర్థులు ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జాబితా నుండి వారి హాల్ టికెట్ నెంబర్ కోసం వెదకొచ్చు.
TSPSC గ్రూప్ 3 కటాఫ్ మార్కులు 2025 (TSPSC Group 3 Cut-Off Marks 2025)
TSPS గ్రూప్ 3 ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష విధానంలో 3 పేపర్లు ఉంటాయి. అభ్యర్థులు కమిషన్ విడుదల చేసిన కనీస కటాఫ్ మార్కులను స్కోర్ చేయాల్సి ఉంది. పరీక్షలో కనీసం 40 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులు తదుపరి రౌండ్ ఎంపికకు అర్హులవుతారు. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్. TSPSC గ్రూప్ 3 కోసం ఎక్స్‌పెక్టెడ్ కటాఫ్ మార్కులు దిగువున అందించాం.అతను TSPS గ్రూప్ 3 కట్ ఆఫ్ మార్కులు 2025 (అంచనా) | |
వర్గం | కటాఫ్ మార్కులు |
UR/ జనరల్ | 190-200 |
EWS | 185-195 |
OBC | 175-180 |
SC | 155-165 |
ST | 165-175 |
PWD | 145-160 |
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.