TSPSC Group 4 Result: అతి త్వరలో TSPSC గ్రూప్-4 ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-4 ఫలితాల విడుదలపై దృష్టి సారించారు. ఈ మేరకు ఫలితాలు (TSPSC Group 4 Result) ఈ వారంలో ఎప్పుడైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది.
TSPSC గ్రూప్ 4 ఫలితాలు 2023 (TSPSC Group 4 Result): టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాల (TSPSC Group 4 Result) వెల్లడిపై దృష్టి సారించింది. ఈ వారంలో ఎప్పుడైనా ఫలితాలు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే TSPSC Group 4 ప్రాథమిక, తుది కీలను కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) వివిధ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ గ్రూప్ 4 పోస్టుల కోసం రాత పరీక్షను 01 జూలై 2023న నిర్వహించింది. ఈ పరీక్షకు 7,62,872 మంది హాజరయ్యారు. వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఫలితాలు విడుదలైన తర్వాత మెరిట్ జాబితాకు ఎంపికైన అభ్యర్థులకు తర్వాతి దశలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించడం జరుగుతుంది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2023 విడుదల తేదీ (TSPSC Group 4 Result 2023 Announcement Date)
టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు 2024 ఈ వారంలో ఏ రోజునైనా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. సంబంధిత వివరాలు ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.బోర్డు పేరు | తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
పోస్టు పేరు | జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ |
పోస్టు కేడర్ | గ్రూప్ 4 |
ఖాళీల సంఖ్య | 9,168 |
రాత పరీక్ష తేదీ | జూలై 01, 2023 |
TSPSC గ్రూప్ 4 ఫలితాల విడుదల తేదీ | త్వరలో |
అధికారిక వెబ్సైట్ | tspsc.gov.in |
TSPSC గ్రూప్ 4 ఫలితం 2023ని చెక్ చేసే విధానం (Steps to check the TSPSC Group 4 Result 2023)
TSPSC గ్రూప్ 4కు సంబంధించిన ఫలితాలను చెక్ చేసుకునే విధానం ఈ దిగువున అందజేశాం.- స్టెప్ 1: అభ్యర్థులు ముందుగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) అధికారిక వెబ్‌సైట్‌ను https://tspsc.gov.in సందర్శించాలి.
- స్టెప్ 2: హోమ్‌పేజీలో న్యూస్ ఫీడ్ విభాగం కోసం వెదికి, దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 3: "గ్రూప్-4 సర్వీసెస్ (19/2022) రాత పరీక్ష ఫలితం" అనే లింక్‌ని గుర్తించి దానిపై క్లిక్ చేయాలి.
- స్టెప్ 4: TSPSC గ్రూప్ 4 ఫలితాల PDF ఆన్లైన్ పరీక్షకు అర్హత సాధించిన అభ్యర్థుల పేర్లు, రోల్ నెంబర్లతో స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
- స్టెప్ 5: Ctrl+F షార్ట్‌కట్‌తో మీ పేర్లు/రోల్ నెంబర్ కోసం శోధించాలి.
- స్టెప్ 6: అభ్యర్థులు TSPSC గ్రూప్ 4 ఫలితం 2023ని డౌన్లోడ్ చేసుకోవాలి, భవిష్యత్తు సూచన కోసం ప్రింటవుట్ తీసుకోవాలి.
Keep visiting CollegeDekho for the latest Education News on entrance exams, board exams and admissions. You can also write to us at our email ID news@collegedekho.com.