TSPSC Junior Lecturer Hall Ticket 2023: TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు విడుదల, ఈ లింక్‌పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి
TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్లు (TSPSC Junior Lecturer Hall Ticket 2023) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థుల కోసం ఇక్కడ డైరక్ట్ లింక్ అందజేశాం. దానిపై క్లిక్ చేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ డౌన్లోడ్ (TSPSC Junior Lecturer Hall Ticket 2023): తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల నియామకానికి నిర్వహించనున్న ఆన్లైన్ పరీక్షల హాల్ టికెట్లు (TSPSC Junior Lecturer Hall Ticket 2023) విడుదలయ్యాయి. TSPSC అధికారిక వెబ్సైట్ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను జనవరి 10న పూర్తి చేసింది. పరీక్ష అథారిటీ ప్రకటించిన పరీక్ష షెడ్యూల్ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అభ్యర్థుల కోసం TSPSC జూనియర్ లెక్చరర్ పరీక్ష తేదీ అధికారిక పోర్టల్‌లో ఆన్లైన్లో ప్రకటించబడింది.
TSPSC జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం పరీక్షలు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2023 వరకు జరగనున్నాయి. రాత పరీక్షలు 12 సెప్టెంబర్న ప్రారంభమై, 03 అక్టోబర్ 2023 నాటికి పూర్తవుతాయి. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను TSPSC రిలీజ్ చేసింది. ప్రస్తుతం అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ రిక్రూట్మెంట్ ఎంపిక ప్రక్రియ ద్వారా మొత్తం 1392 ఖాళీలను భర్తీ చేస్తారు. రోజుకు రెండు సెషన్ల చొప్పున 11 రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల కోసం అభ్యర్థులు ప్రిపరేషన్లో ఉన్నారు. అభ్యర్థుల కోసం TSPSC జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ (TSPSC Junior Lecturer Hall Ticket 2023) ఇక్కడ అందజేస్తున్నాం.
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023 వివరాలు (TSPSC Junior Lecturer Hall Ticket 2023 Details)
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ 2023 వివరాలు ఈ దిగువున టేబుల్లో అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.అథారిటీ పేరు | తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ |
రాష్ట్రం | తెలంగాణ |
పోస్టుల పేరు | జూనియర్ లెక్చరర్ |
పోస్టుల సంఖ్య | 1392 |
పరీక్ష పేరు | సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 |
అధికారిక వెబ్సైట్ | www.tspsc.gov.in |
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే? (How to Download the TSPSC Junior Lecturer Hall Ticket 2023)
టీఎస్పీఎస్సీ జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్‌ను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే విధానం ఈ దిగువున అందించడం జరిగింది. అభ్యర్థులు పరిశీలించవచ్చు.- ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లోకి www.tspsc.gov.in వెళ్లాలి.
- హోంపేజీలో అభ్యర్థులు "హాల్ టికెట్ల" విభాగాన్ని గుర్తించాలి.
- ఇప్పుడు ఆ విభాగంలో అభ్యర్థులు జూనియర్ లెక్చరర్ హాల్ టికెట్ లింక్‌ను గుర్తించాలి.
- ఆపై ఆన్లైన్ అప్లికేషన్ ID, పాస్‌వర్డ్‌ను నమోదు చేయాలి.
- తర్వాత స్క్రీన్‌పై అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది.
- ఇప్పుడు అభ్యర్థులు దానిని సేవ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ తీసుకోవచ్చు.