TSRJC CET 2023 Hall Ticket: TSRJC CET 2023 హాల్ టికెట్ రిలీజ్ ఎప్పుడంటే?
TSRJC CET 2023 హాల్ టికెట్ ఏప్రిల్ 26, 2023 నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. TSRJC అధికారిక వెబ్‌సైట్ tsrjdc.cgg.gov.in నుంచి TSRJC CET 2023 హాల్ టికెట్‌ని (TSRJC CET 2023 Hall Ticket) డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువున తెలిపిన స్టెప్స్‌ని ఫాలో అవ్వాలి.
టీఎస్ఆర్‌జేసీ సెట్ 2023 హాల్ టికెట్ (TSRJC CET 2023 Hall Ticket): తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల TSRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (CET) 2023 హాల్ టికెట్ (TSRJC CET 2023 Hall Ticket) ఏప్రిల్ 26, 2023న విడుదలయ్యే అవకాశం ఉంది. TSRJC CET 2023 పరీక్ష మే 6, 2023న ఉంటుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకుంటున్న వారు TSRJC అధికారిక వెబ్‌సైట్‌ను tsrjdc.cgg.gov.in సందర్శించాలి. అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఈ ఆర్టికల్లో తెలియజేశాం. ఇక్కడ తెలిపిన విధంగా హాల్ టికెట్‌ని చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే అందులో ఉన్న తప్పులను వెంటనే సరి చేసుకునే అవకాశం కూడా ఉంటుంది.
డ్ చేసుకునే విధానం (Steps to Download the TSRJC CET 2023 Hall Ticket)
దరఖాస్తుదారులు TSRJC CET 2023 హాల్ టికెట్‌ని ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ దిగువ పేర్కొన్న విధానాన్ని అనుసరించ వచ్చు.
స్టెప్ 1: TSRJC అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
స్టెప్ 2: 'TSRJC CET' లింక్ గుర్తించాలి. దానిపై క్లిక్ చేయగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది
స్టెప్ 3: కొత్త పేజీలో, హాల్ టికెట్ వీక్షించడానికి దరఖాస్తు నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 4: 'సబ్మిట్'పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ మరొక విండోలో ఓపెన్ అవుతుంది.
స్టెప్ 5: భవిష్యత్తు సూచన కోసం హాల్ టికెట్‌ని సేవ్ చేయడానికి వివరాలని చెక్ చేసి 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయాలి. దాంతో హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.
గమనిక : TSRJC CET 2023 హాల్ టికెట్‌లో ఉన్న వివరాలు తప్పు అని తేలితే, అభ్యర్థులు వెంటనే ఫోన్: 040-23120307 లేదా 040-23120306 నెంబర్లకు కాల్ చేసి, సమస్యను ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట మధ్య, 1:30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల మధ్య తెలియజేయాలి. సరైన హాల్ టికెట్‌ను పరీక్ష రోజున తీసుకెళ్లకపోతే పరీక్షకు అనుమతించరు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొరపాట్లు సరి చేసుకోవాలి. పరీక్షకు ముందే అన్ని సరిచూసుకుని అన్ని డాక్యుమెంట్లను తీసుకెళ్లాలి.
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ న్యూస్ కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.