టీఎస్‌ఆర్‌జేసీ సెట్ (TSRJC CET 2023) నోటిఫికేషన్ తేదీ, అర్హత వివరాలు
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023 Notification) నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లకు TSRJC CET 2023ని నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష కోసం అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల గురించి ఈ ఆర్టికల్లో తెలియజేశాం.
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ (TSRJC CET 2023): తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ (MPC, BiPC, MEC) కోర్సుల్లో ఇంగ్లీష్ మీడియంలో అడ్మిషన్లకు టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023) నిర్వహిస్తారు. టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023 Notification) నోటిఫికేషన్‌ను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ మార్చి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. టీఎస్‌ఆర్‌జేసీ సెట్ (TSRJC CET 2023) వివరాలను సంబంధిత అధికారిక వెబ్‌సైట్ tsrjdc.cgg.gov.inలోకి వెళ్లి తెలుసుకోవచ్చు.
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 అర్హత ప్రమాణాలు (TSRJC CET 2023 Eligibility)
టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు అప్లై చేసుకునే అభ్యర్థులకు (TSRJC CET 2023 Eligibility) కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హత ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు లేకపోతే టీఎస్‌ఆర్‌జేసీ సెట్‌కు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండదు. అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతల వివరాలను ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- టీఎస్ఆర్జేసీ సెట్ 2023 (TSRJC CET 2023)కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తప్పనిసరిగా భారతదేశ పౌరుడై, తెలంగాణ నివాసై ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థి తెలంగాణలో మాత్రమే చదివి ఉండాలి.
- టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 కు దరఖాస్తు (TSRJC CET 2023 Application Form) చేసుకునేందుకు వేరే రాష్ట్రాల విద్యార్థులు అవకాశం ఉండదు.
- పదో తరగతిలో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. మునుపటి సంవత్సరాల్లో పాసైన వారు అర్హులు కాదు.
- OC అభ్యర్థి తప్పనిసరిగా కనీసం 6 GPA, BC, SC, ST, మైనారిటీ అభ్యర్థులు తప్పనిసరిగా S.S.C లేదా తత్సమాన అర్హత పరీక్షలో కనీసం 5 GPA పొంది ఉండాలి. అభ్యర్థులందరూ ఇంగ్లీషులో 4 GPA పొంది ఉండాలి.
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 దరఖాస్తు ఫీజు (TSRJC CET 2023 Application fee)
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023)కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్ష ఫీజు రూ.150లు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజును ఆన్‌లైన్ ద్వారా లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించాలి. నోటిఫికేషన్‌లో సూచించిన లాస్ట్ డేట్ ముగిసేలోపు చెల్లించాలి.టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 పరీక్షా విధానం (TSRJC CET 2023 Examination Pattern)
టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023)కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కచ్చితంగా పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవాలి. పరీక్షా విధానం గురించి ఈ దిగువున తెలియజేయడం జరిగింది.- టీఎస్ఆర్జేసీ సెట్ 2023 (TSRJC CET 2023) ప్రశ్నపత్రం తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే ఉంటుంది.
- పరీక్షను 150 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. (ప్రతి సబ్జెక్టుకు 50 మార్కులు)
- ప్రశ్నల్ని ఆబ్జెక్టివ్ టైప్‌లో ఇవ్వడం జరుగుతుంది.
- రెండు గంటల వ్యవధిలో ఈ పరీక్ష ఉంటుంది.
- అభ్యర్థులు తమ సమాధానాలను OMR షీట్లలో గుర్తించాల్సి ఉంటుంది.
- TSRJC CET 2023లో ఇచ్చే ప్రశ్నలన్ని 10వ తరగతి సిలబస్ నుంచే ఇస్తారు.
అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ టీఎస్‌ఆర్‌జేసీ సెట్ 2023 (TSRJC CET 2023), రిజర్వేషన్, స్పెషల్ కేటగిరీ, లోకల్ ఏరియాలో మెరిట్ ఆధారంగా ఉంటుంది.