VITEEE 2023 Exam: నేటి నుంచే VITEEE 2023, పరీక్ష రోజు అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్లు ఇవే
VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష ఏప్రిల్ 17 నుంచి 23 వరకు జరగనున్నాయి. పరీక్ష (VITEEE 2023 Exam) ఆన్‌లైన్ మోడ్‌లోనే ఉంటుంది. ప్రశ్నలు MCQ ఆధారితంగా ఉంటాయి. పరీక్ష రోజున అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
వీటీఈఈఈ 2023 పరీక్ష (VITEEE 2023 Exam): వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ VIT ఇంజనీరింగ్ ఎంట్రన్స్ పరీక్షను వెల్లూరు, చెన్నైలో ఉన్న క్యాంపస్‌లతో పాటు భోపాల్, అమరావతిలోని విశ్వవిద్యాలయాల్లో బీటెక్ ప్రవేశాల కోసం నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ పరీక్ష (VITEEE 2023 Exam) ఏప్రిల్ 17 నుంచి 23 వరకు జరగనుంది. పరీక్ష ఆన్‌లైన్ మోడ్‌లో జరగబోతుంది.
ఈ పరీక్షలో ప్రశ్నలు MCQ ఆధారితంగా ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఆప్టిట్యూడ్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు 2 గంటల 30 నిమిషాలలో ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి అనుమతించబడతారు. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వడం జరుగుతుంది. తప్పు సమాధానానికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ ఉండదు. VITEEE కోసం అభ్యర్థుల దగ్గర ఉండాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్లు, పరీక్ష రోజు పాటించాల్సిన మార్గదర్శకాల గురించి ఇక్కడ తెలుసుకోండి.
VITEEE 2023: పరీక్ష రోజున అవసరమైన ముఖ్యమైన పత్రాలు (VITEEE 2023: Important Documents Required on Exam Day)
పరీక్ష రోజున అవసరమైన అన్ని పత్రాలు ఈ దిగువున ఇవ్వడం జరిగింది. పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు అభ్యర్థులు ఈ దిగువున తెలిపిన పత్రాలు తమ దగ్గర ఉన్నాయో? లేదో? అభ్యర్థులు చెక్ చేసుకోవాలి. అప్పుడు చివరి నిమిషంలో ఎటువంటి టెన్షన్ లేకుండా అభ్యర్థులు పరీక్ష రాయగలుగుతారు.- హాల్ టికెట్
- ఫోటో గుర్తింపు కార్డు
VITEEE 2023: పరీక్ష రోజు మార్గదర్శకాలు (VITEEE 2023: Exam Day Guidelines)
VITEEE 2023 పరీక్ష రోజు అభ్యర్థులు పాటించాల్సిన మార్గదర్శకాలును ఈ దిగువున ఇవ్వడం జరిగింది.- అభ్యర్థులు పరీక్షకు కనీసం 30 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలని సిఫార్సు చేయబడింది.
- పరీక్ష హాలులో కాలిక్యులేటర్లు, మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, మరే ఇతర గాడ్జెట్‌లను తీసుకెళ్లకూడదు.
- పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థులను హాల్‌లోకి అనుమతించరు.
- అభ్యర్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో తమ హాల్ టికెట్‌ని చూపించాలి. అధికారులు దానిని ధ్రువీకరించడం జరుగుతుంది.
- ఇన్విజిలేటర్ ముందు హాజరు షీట్‌లో సైన్ ఇన్ చేయాలి..
తెలుగులో మరిన్ని వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి.