Vizianagaram Anganwadi Recruitment 2023: విజయనగరం అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలేంటో ఇక్కడ తెలుసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని అంగన్‌వాడీ ఉద్యోగాల (Vizianagaram Anganwadi Recruitment 2023) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్‌వాడీ వర్కర్ల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతల గురించి ఈ ఆర్టికల్లో అందజేశాం.
విజయనగరం అంగన్‌వాడీ రిక్రూట్‌మెంట్ 2023 (Vizianagaram Anganwadi Recruitment 2023): ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలోని అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టుల (Vizianagaram Anganwadi Recruitment 2023) భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 78 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకి కేవలం మహిళల మాత్రమే అర్హులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ఏ అర్హతలుండాలో? ఇక్కడ తెలుసుకోండి.
విజయనగరం జిల్లా అంగన్‌వాడీ పోస్టుల సంఖ్య (Vizianagaram District Anganwadi Posts No)
విజయనగరం జిల్లాలోని 78 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడం జరిగింది. అంగన్‌వాడీ ప ోస్టుల వివరాలు ఇక్కడ చూడండి.అంగన్‌వాడీ పోస్టులు | సంఖ్య |
అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగాలు | 10 |
అంగన్‌వాడీ సహాయకురాల పోస్టులు | 53 |
మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు | 15 |
చివరి తేదీ | మార్చి 29, 2023 |
విజయనగరం అంగన్‌వాడీ ఉద్యోగాలకు అవసరమైన అర్హతలు (Vizianagaram Recruitment required eligibility details)
అంగన్‌వాడీ కార్యకర్తలు, అంగన్‌వాడీ సహాయకురాలు పోస్టులకు దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులకు ఈ దిగువున తెలిపిన అర్హతలు ఉండాలి.- స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలై ఉండాలి
- కచ్చితంగా వివాహితై ఉండాలి
- పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. జూలై ఒకటి, 2022 నాటికి అభ్యర్థి వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
- తెలుగులో రాయడం, చదవడం వచ్చి ఉండాలి.
విజయనగరం అంగన్‌వాడీ ఉద్యోగాలకు సేలరీ (Vizianagaram Anganwadi Posts Salary Details)
విజయనగరంలో అంగన్‌వాడీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి జీతం అందజేయడం జరుగుతుంది. అంగన్‌వాడీ కార్యకర్తలకు రూ.11,500లు, అంగన్‌వాడీ హెల్పర్లకు, మినీ అంగన్‌వాడీ వర్కర్లకు రూ.7,000లు అందజేయడం జరుగుతుంది.విజయనగరం అంగన్‌వాడీ పోస్టులకు అవసరమైన పత్రాలు (List of Documents Required to Submit with Application Form)
విజయనగరంలోని అంగన్‌వాడీ ఉద్యోగాలకు కేవలం ఆఫ్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 29 , 2023వ తేదీ సాయంత్రం 5 గంటల్లలోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారి కార్యాలయంలో నేరుగా గానీ లేదా పోస్టు ద్వారా గానీ అందజేయాలి. గడువు ముగిసిన తర్వాత అందిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించడం జరుగుతుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు మహిళలను మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది. దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులకు అసవరమైన పత్రాలను ఈ దిగువున అందజేయడం జరిగింది.- నివాస ధ్రువీకరణ పత్రం
- పూర్తి వివరాలు నింపిన దరఖాస్తు ఫార్మ్
- పాస్‌పోర్ట్ సైజు ఫోటో
- SC/ST/OBC మొదలైనవి సర్టిఫికెట్‌లు
తెలుగులో మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం https://www.collegedekho.com/te/news/ ఈ లింక్‌పై క్లిక్ చేయండి